Ukraine War : భారత్ లో భారీగా పెరిగే ధరలు ఇవే

ఉక్రెయిన్ - రష్యా ల మధ్య యుద్ధంతో భారత్ లో అనేక వస్తువుల ధరలు పెరగనున్నాయి.

Update: 2022-02-28 02:59 GMT

ఉక్రెయిన్ - రష్యా ల మధ్య యుద్ధంతో భారత్ లో అనేక వస్తువుల ధరలు పెరగనున్నాయి. యుద్ధం కొనసాగితే భారత్ లో అనేక వస్తువుల ధరలు పెరుగుతాయి. వంటనూనె, బంగారం ధరలు మరింత ప్రియం కానున్నాయి. భారత్ సన్ ఫ్లవర్ ఆయిల్ ను ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సన్ ఫ్లవర్ ఆయిల్ లో 90 శాతం రష్యా, ఉక్రెయిన్ ల నుంచే దిగుమతి అవుతుంది.

దిగుమతులు లేక....
అయితే ఫిబ్రవరి నెల నుంచి ఉక్రెయిన్, రష్యాల నుంచి దిగుమతులు నిలిచిపోయాయి. లక్షల టన్నుల్లో దిగుమతి కావాల్సిన సన్ ఫ్లవర్ ఆయిల్ భారత్ కు చేరుకోలేదు. సరిహద్దుల మధ్య ఉద్రిక్తతలు దిగుమతులకు ఆటంకంగా మారాయి. దీంతో యుద్ధం మరికొద్ది రోజులు కొనసాగితే వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశముంది.
బంగారం కూడా....
ఇక క్రూడ్ ఆయిల్ ధర ఇప్పటికే వంద డాలర్లకు చేరుకుంది. గత ఏడేళ్లలో గరిష్ట స్థాయికి క్రూడాయిల్ ధర చేరుకుంది. దీంతో పెట్రో ఉత్పత్తి ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. ఇక బంగారం ధరలు కూడా మరింత పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.


Tags:    

Similar News