రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన యశ్వంత్ సిన్హా

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా నామినేషన్ వేశారు. విపక్షాల మద్దతుతో ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో ఉన్నారు.

Update: 2022-06-27 09:47 GMT

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా నామినేషన్ వేశారు. విపక్షాల మద్దతుతో ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో ఉన్నారు. నామినేసన్ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు రాహుల్, ఖర్గే, జైరాం రమేష్ , ఎన్సీపీ నుంచి శరద్ పవార్, ప్రపుల్ పటేల్, ఎస్పీ నుంచి మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, డీఎంకే నుంచి రాజా, టీఆర్ఎస్ నుంచి కేటీఆర్, నామా, ఎన్సీ నుంచి ఫరూఖ్ అబ్దాల్లా హాజరయ్యారు. టీఎంసీ నుంచి సౌగతో రాయ్, సీపీఎం నుంచి సీతారాం ఏచూరీ హాజరయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌, బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని పోటీకి దించాలని మొదట్లో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌‌‌‌ ప్రతిపాదించారు. పశ్చిమ బెంగాల్‌‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో కాంగ్రెస్‌‌‌‌ సహా అనేక ప్రాంతీయ పార్టీలు కలిసి యశ్వంత్‌‌‌‌ సిన్హాను తమ అభ్యర్థిగా ప్రకటించాయి.

యశ్వంత్ సిన్హాకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మద్దతు ఇస్తున్నట్లు ఆయన కుమారుడు, రాష్ట్ర మంత్రి కెటి రామారావు ట్వీట్‌లో తెలిపారు. "భారత రాష్ట్రపతి ఎన్నికలలో యశ్వంత్ సిన్హా జీ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయించుకున్నారు. మా పార్లమెంట్ సభ్యులతో పాటు, ఈరోజు నామినేషన్ వేస్తున్నప్పుడు TRS తరపున నేను ప్రాతినిధ్యం వహిస్తాను" అని KTR తెలిపారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము జూన్ 24న నామినేషన్ వేశారు. రాజ్యసభ సెక్రటేరియట్ లో ఆమె నామినేషన్ దాఖలు చేశారు.


Tags:    

Similar News