వైసీపీ, బీఆర్ఎస్ లకు ఎలక్టోరల్ బాండ్ల వర్షం
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి భారీగా విరాళాలు వచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించిం;
2016-17 నుండి 2021-22 మధ్య ఆరేళ్ల కాలంలో జాతీయ పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు భారీగా నిధులు వచ్చాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి భారీగా విరాళాలు వచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యు) సంయుక్తంగా తయారు చేసిన నివేదిక ప్రకారం రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలలో సగానికి పైగా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారానే వస్తున్నాయి. బీజేపీకి వచ్చిన మొత్తం విరాళాలలో 52% కంటే ఎక్కువ అంటే రూ.5,271.97 కోట్ల విలువైన మొత్తం ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చాయి. మిగతా అన్ని ఇతర జాతీయ పార్టీలు రూ.1783.93 కోట్లను ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో అందుకున్నాయి. ఈ ఆరేళ్ల కాలంలో ఏడు జాతీయ పార్టీలు, 24 ప్రాంతీయ పార్టీలకు వచ్చిన విరాళాల మొత్తం రూ.16,437 కోట్లు. ఇందులో 56 శాతం అంటే రూ.9,188.35 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చాయి. బీజేపీకి వచ్చిన మొత్తం విరాళాలు రూ.10,122 కోట్లు, కాంగ్రెస్ కు రూ.1,547.43 కోట్లు, టీఎంసీకి రూ.823.30 కోట్లు వచ్చినట్లు ఏడీఆర్ నివేదిక తెలిపింది. ఏడు జాతీయ పార్టీలు, 24 ప్రాంతీయ పార్టీలకు మొత్తం వచ్చిన విరాళాలలో రూ.4,614 కోట్లు కార్పోరేట్ రంగం నుండి రాగా, బీజేపీకి 32 శాతం వచ్చాయి. అన్ని పార్టీలకు కలిపి రూ.2,634 కోట్లు ఇతర వనరుల నుండి వచ్చాయి. మొత్తం విరాళాల్లో 80 శాతం వాటా జాతీయ పార్టీలదే. దీని విలువ రూ.13,190 కోట్లు.