రైల్వేలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ .. విద్యార్హతల్లో మార్పులు.. గుడ్ న్యూస్

నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది.;

Update: 2025-01-05 02:33 GMT

నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒకేసారి 32,438 ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన విద్యార్హతలను కూడా నిర్ణయించింది. భారతీయ రైల్వేలో పనిచేయాలని భావించే వారు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రైల్వేలో 32,438 ఉద్యోగాల భర్తీలో విద్యార్హతలలో మార్పులు చేసింది.


దరఖాస్తు చేసుకోవాడానికి...

రైల్వేలో 32,438 గ్రూప్-డి ఉద్యోగాల భర్తీలో విద్యార్హతల్లో రైల్వే బోర్డు మార్పులు చేసింది. టెన్త్/ఐటీఐ/నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన జాతీయ అప్రెంటిస్ షిప్ సర్టిఫికెట్ ఉన్న ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పాయింట్ మెన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్ సహా పలు పోస్టులు భర్తీ చేస్తారు. ఈ నెల 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now



Tags:    

Similar News