తరువాత టార్గెట్ గంటాయేనా…?

విశాఖకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కు అయితే టీడీపీ లేకపోతే బీజేపీ గతి అయ్యేట్లుగా ఉంది ఇపుడు. ఆయనకు చంద్రబాబు మీద ద్వేషం లేదు, [more]

Update: 2020-11-22 15:30 GMT

విశాఖకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కు అయితే టీడీపీ లేకపోతే బీజేపీ గతి అయ్యేట్లుగా ఉంది ఇపుడు. ఆయనకు చంద్రబాబు మీద ద్వేషం లేదు, జగన్ మీద ప్రేమ అంతకంటే లేదు, కేవలం తాను తన అనుచరులు అక్రమంగా చేసిన భూ దందాల నుంచి అర్జంటుగా రక్షణ కావాలి. అందుకే ఆయన అప్పట్లో వైసీపీ వైపు వేగంగా అడుగులు వేశారని చెబుతారు. జగన్ అధికారంలోకి వచ్చాక విశాఖ భూ దందాల మీద రెండవ సారి సిట్ వేశారు. నాడు సిట్ మీద గంటా శ్రీనివాసరావు సైతం సానుకూలంగానే మాట్లాడారు. పైగా తనకు ఏ భయం లేదని కూడా చెప్పుకున్నారు. అయితే దాని వెనక ఆయనకు పొలిటికల్ ప్లాన్ ఉందని తరువాత అర్ధం అయింది.

మొదట ఓకే……

సరిగ్గా అదే సమయంలో విశాఖను పాలనా రాజధానిగా చేస్తూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ టీడీపీకి పెట్టని కోట. మరో వైపు అమరావతిని మూడవ వంతుకు తగ్గించడంతో పాటు, విశాఖకు ప్రయారిటీ ఇవ్వడానికి జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో టీడీపీ ఒక రేంజిలో రెచ్చిపోయింది. విశాఖలో నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న చోట టీడీపీ గర్జిస్తే అసలుకే ఎసరు అని జగన్ గ్రహించి గంటా శ్రీనివాసరావు వంటి బిగ్ షాట్ కి ఆనాడు స్వాగతం పలికారు అని చెబుతారు. అయితే ఆ తరువాత జరిగిన పరిణామాల్లో టీడీపీకి విశాఖ జనాల నుంచి ఆశించిన స్పందన కనీపించకపోవడంతో తమ్ముళ్ళు బాగా తగ్గారు. దానికి తోడు గంటా చేరిక విషయంలో వైసీపీలో భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం కావడంతో గంటా కేసుని జగన్ పెండింగులో పెట్టారు.

తవ్వి తీస్తున్నారుగా…?

ఇక గత పది నెలలుగా విశాఖలో అక్రమ నిర్మాణాలతో పాటు, భూ దందాలను కూడా వైసీపీ సర్కార్ తవ్వి తీస్తోంది. మరో వైపు చంద్రబాబు హయాంలో వచ్చిన సిట్ నివేదికతో పాటు, జగన్ వేసిన కొత్త సిట్ ద్వారా కూడా ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. దాంతో పెద్ద తలకాయలు చాలా మంది విశాఖ భూములను చాప చుట్టేశారని కచ్చితమైన ఆధారాలతో సహా వైసీపీ సర్కార్ వద్ద ఉన్నాయి. అందులో పెందుర్తి నియోజకవర్గంలో దాదాపు వంద ఎకరాల ప్రభుత్వ భూమిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయన అనుచరుల దందా కూడా బయటపడిందని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం మీద పూర్తి విచారణ జరిపి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేశారు అంటున్నారు.

ఇక కష్టమేనా …..?

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరడానికి తెర వెనక రాజకీయ వ్యక్తిగత కారణాలు జగన్ కి తెలిసిపోవడంతో ఆయన మాజీ మంత్రి డోర్స్ క్లోజ్ చేశారని అంటున్నారు. ఇక ఆయన అనుచరులు చేసిన భూ దందా మీద విచారణ జరిపించి త్వరలో అతి పెద్ద ఆపరేషన్ చేపడతారని కూడా అంటున్నారు. అంతే కాదు, గంటా శ్రీనివాసరావు విద్యా శాఖ మంత్రిగా ఉండగా సైకిళ్ళ కొనుగోలులో అవినీతి జరిగిందని ఇప్పటికే విజయసాయిరెడ్డి ఆరోపించారు. దాంతో ఆయన శాఖలలో జరిగిన అవినీతి మీద కూడా దర్యాప్తు ఉంటుందని అంటున్నారు. మొత్తానికి కొద్ది రోజుల్లోనే విశాఖ నుంచి అతి పెద్ద రాజకియ సంచలన విషయాలే బయటకు వస్తాయని అంటున్నారు.

Tags:    

Similar News