కన్నా వర్సెస్ జీవీఎల్ ఎందుకో?

ఏపీ బీజేపీ పుంజుకోవ‌డం మాట అటుంచితే ఇప్పుడున్న ప‌రిస్థితిలో అంత‌ర్గత విభేదాల‌తో తీవ్రంగా ర‌గిలి పోతోంది. రాష్ట్రంలో బీజేపీ చీఫ్‌గా ఉన్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణకు ప్రకాశం జిల్లా [more]

Update: 2020-02-17 00:30 GMT

ఏపీ బీజేపీ పుంజుకోవ‌డం మాట అటుంచితే ఇప్పుడున్న ప‌రిస్థితిలో అంత‌ర్గత విభేదాల‌తో తీవ్రంగా ర‌గిలి పోతోంది. రాష్ట్రంలో బీజేపీ చీఫ్‌గా ఉన్న క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణకు ప్రకాశం జిల్లా చీరాల‌కు చెందిన మ‌రో నేత‌, కేంద్రంలో ఐదు రాష్ట్రాల‌కు ఇంచార్జ్‌గా ఉన్న జీవీఎల్‌కు మ‌ధ్య తీవ్ర విభేదాలు న‌డుస్తున్నా య‌ని అంటున్నారు. ఏపీ విష‌యంలో జ‌గ‌న్‌ను ఇరుకున పెట్టాల‌ని రాష్ట్ర బీజేపీ నేత‌ల వ్యూహం. ఈ క్రమంలోనే క‌న్నా నోరు తెరిస్తే జ‌గ‌న్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు నిన్నమొన్నటి వ‌ర‌కు కూడా.

జగన్ నిర్ణయాలన్నింటినీ….

అయితే, దీనికి భిన్నంగా జీవీఎల్ వ్యవ‌హ‌రిస్తున్నారు. దీంతో క‌న్నా వ‌ర్సెస్ జీవీఎల్ పోరు సాగుతోంద‌నడంలో సందేహం లేదు. రాష్ట్రంలో మూడు రాజ‌ధానుల నిర్ణయం నుంచి ఇంగ్లీష్ మీడియం వ‌ర‌కు కూడా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ జ‌గ‌న్ నిర్ణయాల‌ను తీవ్రంగా విభేదించారు. ఆయ‌న సొంత నిర్ణయాలు తీసుకుంటే కేంద్రం చూస్తూ ఊరుకోద‌ని చెప్పుకొచ్చారు. అంతేకాదు, అమ‌రావతిలో రైతుల ఆందోళ‌న‌లు జ‌రుగుతున్న ప్రాంతాల‌కు వెళ్లి వారికి మ‌ద్దతు కూడా ప్రక‌టించారు.

ఏమాత్రం తగ్గకుండా…?

ఈ ప‌రిణామాలు ఇలా సాగుతున్న క్రమంలోనే జీవీఎల్ బాంబు పేల్చారు. ఏపీ రాజ‌ధాని విష‌యంలో కేంద్రం జోక్యం చేసుకోద‌ని చెప్పారు. దీంతో క‌న్నా హ‌ర్ట్ అయ్యారు. అయినా కూడా రాష్ట్ర చీఫ్‌గా తాను చెప్పిందే ఫైన‌ల్ అంటూ మ‌ళ్లీ ప్రక‌టించారు. దీనిపై జీవీఎల్ కూడా తాను కేంద్రంతో మాట్లాడి చెబుతున్నాన‌ని మ‌ళ్లీ ఢిల్లీలో స్పష్టం చేశారు. మొత్తంగా చూసుకుంటే ఈ వివాదం రాజ‌కీయ పార్టీల ప‌రిధి దాటి వ్యక్తిగ‌త ప‌ట్టుద‌లల వ‌ర‌కు చేరిపోయింది. అంటే మొత్తంగా చూస్తే రాష్ట్ర బీజేపీలో క‌న్నాపై జీవీఎల్ ఆధిప‌త్యం ప్రద‌ర్శిస్తున్నార‌ని ఓ వ‌ర్గం చెవులు కొరుక్కుంది.

రాజధాని విషయంలో….

ఇక‌, ఇప్పుడు కేంద్రం కూడా ఏపీ విష‌యంలో క‌లుగ‌జేసుకునేది లేద‌ని చెప్పేసింది. అదే స‌మ‌యంలో ఏపీ ప్రభుత్వం రాజ‌ధాని విష‌యంలో మరో తీర్మానం చేస్తే దానిని కూడా నోటిఫై చేస్తామ‌ని కేంద్రం ప్రక‌టించింది. సో.. క‌న్నా లక్ష్మీనారాయణ నోటికి తాళం వేసుకున్నారు. అదే స‌మ‌యంలో జీవీఎల్ దూకుడును మ‌రింత పెంచుతున్నారు. అయితే, ఇది ప్రచ్ఛన్న యుద్ధంగా మారుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇది పెరిగి గ్యాప్ మ‌రింత పెరిగితే క‌ష్టమేన‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News