పినరయికి ఏమాత్రం డౌట్ లేదట.. కారణాలివేనట

దేశంలో కమ్యునిస్టులు ఎక్కడా అధికారంలో లేరు. ఒక్క కేరళలోనే సీపీఎం అధికారంలో ఉంది. అక్కడ కూడా మరికొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇక్కడ సీపీఎం మరోసారి గెలవకపోతే [more]

Update: 2021-03-13 17:30 GMT

దేశంలో కమ్యునిస్టులు ఎక్కడా అధికారంలో లేరు. ఒక్క కేరళలోనే సీపీఎం అధికారంలో ఉంది. అక్కడ కూడా మరికొద్దిరోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇక్కడ సీపీఎం మరోసారి గెలవకపోతే దేశంలో ఎక్కడా కమ్యునిస్టు పార్టీ అధికారంలో ఉండకుండా పోతుంది. అందుకే కేరళ ఎన్నికలను వామపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీనికి తోడు ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాలన పట్ల కూడా ప్రజలు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తునట్లు ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి.

ఒక్కసారి మాత్రమే…..

కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్నాయి. 71 స్థానాలు వస్తే వారిదే విజయం. కానీ ఎప్పుడూ ఒకసారి అధికారంలో ఉన్న పార్టీ మరసారి పవర్ లోకి వచ్చే అవకాశం లేదు. 1977లో మాత్రమే కాంగ్రెస్ ఫ్రంట్ మరోసారి అధికారంలోకి రాగలిగింది. ఆ తర్వాత రెండోసారి అధికారాన్ని ఎవరూ చేపట్టలేదు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత ఈసారి పినరయి విజయన్ చరిత్రను తిరగరాస్తారని చెబుతున్నారు. పినరయి విజయన్ నాయకత్వంపై కేరళ ప్రజలు పూర్తి సంతృప్తిగా ఉన్నారు.

పినరయి నాయకత్వంపై….

2016లో జరిగిన ఎన్నికల్లో 91 స్థానాలను అధికార ఎల్డీఎఫ్ సాధించింది. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ 47 స్థానాల్లోనే విజయం సాధించింది. ఈసారి కూడా 70 నుంచి 90 సీట్ల మధ్యలో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ విజయం సాధిస్తుందని చెబుతున్నారు. కేరళ కష్టకాలంలో ఉన్నప్పుడు పినరయి విజయన్ చూపిన చొరవ, తీసుకున్న నిర్ణయాలు ఆయనకు ఈ ఎన్నికల్లో మేలు చేకూర్చనున్నాయి. దీంతో పాటు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సయితం ఎల్డీఎఫ్ ఘన విజయం సాధించడంతో ఆ ప్రభావం కూడా ఈ ఎన్నికలపై పడనుంది.

గోల్డ్ స్కామ్ లోనూ…..

పినరయి విజయన్ ను ఇరుకున పెట్టడానికి గోల్డ్ స్కామ్ ను వెలుగులోకి తెచ్చారు. కేరళ గోల్డ్ స్కాంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. గోల్డ్ స్కాంపై సీబీఐ దర్యాప్తు చేపట్టి ఏడు నెలలు గడుస్తున్నా ఇంతవరకూ దానిపై పినరయి విజయన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆధారాలను చేపట్టలేదు. ఇది కేంద్ర ప్రభుత్వం, విపక్షాల కుట్ర అని పినరయి విజయన్ చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్మే అవకాశముంది. కేరళలో మరోసారి అధికారంలోకి ఎల్డీఎఫ్ రాగలిగితే దేశంలో కమ్యునిస్టులకు ఒక రాష్ట్రంలోనైనా అధికారంలో ఉండగలిగామన్న సంతృప్తి దక్కుతుంది. లేకుంటే దేశం నుంచి లెఫ్ట్ అయినట్లే.

Tags:    

Similar News