హుజూరాబాద్ లో అభ్యర్థి ఆయనేనట
హుజూరాబాద్ నియోజకవర్గంలో అభ్యర్థిని నిర్ణయించకపోయినా అన్ని రకాల అస్త్రశస్త్రాలను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధం చేస్తున్నారు. అభ్యర్థి ఎవరనేది పక్కన పెడితే ముందుగా అన్ని సామాజికవర్గం ఓట్లను [more]
హుజూరాబాద్ నియోజకవర్గంలో అభ్యర్థిని నిర్ణయించకపోయినా అన్ని రకాల అస్త్రశస్త్రాలను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధం చేస్తున్నారు. అభ్యర్థి ఎవరనేది పక్కన పెడితే ముందుగా అన్ని సామాజికవర్గం ఓట్లను [more]
హుజూరాబాద్ నియోజకవర్గంలో అభ్యర్థిని నిర్ణయించకపోయినా అన్ని రకాల అస్త్రశస్త్రాలను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్ధం చేస్తున్నారు. అభ్యర్థి ఎవరనేది పక్కన పెడితే ముందుగా అన్ని సామాజికవర్గం ఓట్లను కారు పార్టీవైపు మళ్లించేలా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారు. దళిత బంధు పథకం ప్రకటనతో పాటు ఎల్ రమణను, పెద్దిరెడ్డిని పార్టీలోకి తీసుకురావడం కూడా ఇందులో భాగమే. ఇప్పుడు అభ్యర్థి ఎంపికపై కేసీఆర్ అన్ని రకాలుగా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఐదు పేర్లను….
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే అభ్యర్థిగా ఐదు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో పెద్దిరెడ్డి, గెల్లు శ్రీనివాసయాదవ్, ముద్దసాని పురుషోత్తం రెడ్డి, స్వర్గం రవి, ఎల్ రమణ ఉన్నారు. ఇందులోముద్దసాని పురుషోత్తం రెడ్డి, పెద్దిరెడ్డి సామాజికవర్గం కూడా బలంగా ఉంది. అక్కడ ఈ కుటుంబానికి పట్టు ఉంది. అందుకే ఈ రెండు పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.
సర్వేలు, ఇంటలిజెన్స్ నివేదికతో….
ఇక గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు కూడా బలంగానే వినపడుతుంది. ఆయన ఈటల రాజేందర్ ను ఢీకొనే స్థాయి ఉందని చెబుతున్నారు. ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న శ్రీనివాస్ యాదవ్ పేరును సీరియస్ గా పరిశీలిస్తుననారు. స్వర్గం రవి పేరు కూడా ప్రముఖంగానే వినపడుతుంది. బీసీ వర్గానికి చెందిన స్వర్గం రవి పేరును కేసీఆర్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. బీసీ సామాజికవర్గం నేతగా, పారిశ్రామికవేత్తగా స్వర్గం రవి సుపరిచితుడు కావడంతో ఈ పేరును సీరియస్ గానే కేసీఆర్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
ఆయనవైపే మొగ్గు…?
ఈ ఐదు పేర్లతో ఇప్పటికి హుజూరాబాద్ లో కేసీఆర్ సర్వేలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే స్వర్గం రవి వైపు సర్వేలు మొగ్గు చూపుతున్నాయని అంటున్నారు. ఈయన కాంగ్రెస్ నేతగా అందరికీ సుపరిచితుడు కావడంతో ప్లస్ పాయింట్ అయింంటున్నారు. ఇంటలిజెన్స్ వర్గాల నివేదికలో కూడా సర్గం రవి పేరు ఉన్నట్లు తెలుస్తోంది. బీసీ సామాజికవర్గం అధికంగా ఉన్న హుజూరాబాద్ లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ధీటైన అభ్యర్థి అవుతారని కేసీఆర్ భావిస్తున్నారు. త్వరలోనే అభ్యర్థిని కేసీఆర్ ప్రకటించే అవకాశముంది.