ముదురుతున్న ఫ్లెక్సీల గొడవ.. నెల్లూరులో మరోసారి భగ్గుమన్న విబేధాలు
గత రాత్రి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చింపేశారు. వేమిరెడ్డికి..;
నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య ఫ్లెక్సీల వివాదం మరింత ముదురుతోంది. మంత్రి కాకాణి గోవర్థన్ ఫ్లెక్సీ తొలగింపు గొడవ ఇప్పుడిప్పుడే సద్దుమణిగింది అనుకుంటుండగా.. మరో ఘటన జరిగింది. గత రాత్రి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చింపేశారు. వేమిరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. మద్దతుదారులు నెల్లూరులోని ముత్తుకూరు రోడ్ సర్కిల్ లో ఫ్లెక్సీ పెట్టారు.
ఆ ఫ్లెక్సీలను ఎవరో చింపేయడంతో ఆయన అనుచరులు మండిపడుతున్నారు. ఇటీవల మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. దాంతో ఆయన మద్దతుదారులు ఫ్లెక్సీలు పెట్టగా.. గుర్తు తెలియని వ్యక్తులు వాటిని తొలగించారు. వైసీపీలో అంతర్గత విబేధాల కారణంగా మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ అనుచరులే వాటిని తొలగించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఫ్లెక్సీ వివాదం ఎంతదూరం వెళ్తుందో.. ఎలా పరిష్కారమవుతుందో చూడాలి.