Gender Change: అనసూయ ఇప్పుడు అనుకతిర్ సూర్య.. ఎలా మారారంటే?

తన పేరు, లింగాన్ని మార్చాలని హైదరాబాద్‌కు చెందిన సీనియర్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్

Update: 2024-07-10 05:32 GMT

తన పేరు, లింగాన్ని మార్చాలని హైదరాబాద్‌కు చెందిన సీనియర్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారి చేసిన విజ్ఞప్తిని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించింది. భారత సివిల్ సర్వీస్ చరిత్రలో ఇలాంటి మార్పు జరగడం ఇదే ప్రథమం. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎం. అనుసూయ తన పేరును ఎం అనుకతిర్ సూర్యగా మార్చాలని.. సెక్స్ స్థానంలో స్త్రీ నుండి 'మగ' కు మార్చాలని అభ్యర్థించారు. అధికారి అభ్యర్థనను పరిశీలించి ఆమోదించినట్లు మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. "ఎం.అనుసూయ అభ్యర్థన పరిగణించాం. ఇకమీదట, అధికారి అన్ని అధికారిక రికార్డులలో 'మిస్టర్ ఎం.అనుకతిర్ సూర్య'గా గుర్తింపు పొందనున్నారు" అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు కస్టమ్స్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ నుండి వచ్చిన ఉత్తర్వు పేర్కొంది.

IRS అధికారి 2013లో చెన్నైలో అసిస్టెంట్ కమిషనర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. 2018లో డిప్యూటీ కమిషనర్ ర్యాంక్‌కు పదోన్నతి పొందారు. సూర్య చెన్నైలోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్స్ చేశారు. ఆ తర్వాత నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్శిటీ నుంచి సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్‌లో పీజీ డిప్లొమా చదివారు. చరిత్రలో తొలిసారి వచ్చిన అభ్యర్థనకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌లో కస్టమ్స్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న 35 ఏళ్ల ఎం.అనసూయ ఇప్పుడు ఎం.అనుకతిర్ సూర్యగా మారిపోయారు. స్త్రీగా ఉన్న అనుకతిర్‌ను ఇకపై పురుషుడిగా ప్రభుత్వం పరిగణించనుంది.


Tags:    

Similar News