బంగ్లాదేశ్ లో హిందువులపై హింస.. భారత జోక్యం చేసుకునేనా!!

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, బంగ్లాదేశ్‌లోని సామాజిక-రాజకీయ వాతావరణంలో;

Update: 2024-08-10 09:57 GMT

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, బంగ్లాదేశ్‌లోని సామాజిక-రాజకీయ వాతావరణంలో మార్పులు వస్తూనే ఉన్నాయి. బంగ్లాదేశ్ లో ఏదైనా అలజడి మొదలైతే.. భారత్ లోని పశ్చిమ బెంగాల్‌ లో కూడా ఆ ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది. దేశ విభజన, ఆ తర్వాత చోటు చేసుకున్న గందరగోళ సంఘటనల కారణంగా బంగ్లాదేశ్ నుండి లక్షలాది మంది భారత్ లోకి వచ్చేశారు. వారు పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాం, మేఘాలయ వంటి రాష్ట్రాలలో ఆశ్రయం పొందారు. చాలా మంది తమ జీవితాలను పునర్నిర్మించుకోవాలనే ఆశతో వచ్చారు కానీ శరణార్థి అనే ముద్ర వారిని వెంటాడుతూ ఉంది. దశాబ్దాల తర్వాత, బంగ్లాదేశ్ లో మళ్లీ అశాంతిని ఎదుర్కొంటోంది. అక్కడి మైనారిటీ వర్గాలు అభద్రతాభావంతో పోరాడుతూ ఉన్నాయి. బెంగాలీ హిందువులు మాత్రమే కాకుండా హిందూ సంఘాలు కూడా పొరుగు దేశంలోని మైనారిటీ హక్కుల పరిరక్షణ కోసం ఆందోళనలను వ్యక్తం చేస్తున్నాయి.


గత జ్ఞాపకాలు:

గతంలో ఎన్నో దారుణాలను చూసిన పలువురు బెంగాలీ హిందువులతో మీడియా మాట్లాడింది. వారు చెప్పినవి వింటే బంగ్లాదేశ్‌లో మైనారిటీలు ఇంత భయంకరమైన జీవితాలు గడిపారా అని అనిపించక మానదు.


1971లో భారతదేశానికి పారిపోయి వచ్చిన.. సుశీల్ గంగోపాధ్యాయ బంగ్లాదేశ్‌లోని నోఖాలీ జిల్లాలో తన సుసంపన్నమైన జీవితాన్ని గుర్తు చేసుకున్నారు. "మాది పెద్ద కుటుంబం, విస్తారమైన భూములు ఉన్నాయి. కానీ బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో.. పాకిస్తాన్ సైన్యం, రజాకార్లు మాపై దాడి చేశారు. మా ఇళ్లు తగులబెట్టారు. చాలా మందిని అతి కిరాతకంగా చంపారు," అని ఆయన వివరించారు. అతని గొంతులో దుఃఖం కొట్టొచ్చినట్లు కనిపించింది. మెజారిటీ సమాజం నుండి నిరంతర సమస్యలు ఉన్నందుకు అతను భారతదేశంలో శాశ్వత ఆశ్రయం పొందవలసి వచ్చింది.
Full View

ప్రస్తుత పరిస్థితి గురించి కూడా సుశీల్ తీవ్రమైన బాధను వ్యక్తం చేశారు. "బంగ్లాదేశ్‌లో ఇటీవలి సంఘటనలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. గర్భిణీ స్త్రీని కడుపులో తన్నిన దృశ్యాలు చూశాను. ఇలాంటి క్రూరత్వాన్ని అసలు ఊహించలేము. ఒక భారతీయుడిగా, నేను వారిని రక్షించాలని డిమాండ్ చేస్తున్నాను. హిందువుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే తప్పకుండా భారత్ చర్యలు తీసుకోవాలి." అని తెలిపారు.

1971 నాటి భయంకరమైన జ్ఞాపకాలు ఇంకా ఆయనలో సజీవంగా ఉన్నాయి. "నా వయసు కేవలం 10 లేదా 12 ఏళ్లు. రజాకార్లు మమ్మల్ని హింసించారు. మగవాళ్లను నదుల్లోకి విసిరారు.. మా తల్లులను అతి దారుణంగా చూశారు. చాలా మంది మహిళలపై పాకిస్తాన్ సైన్యం అత్యాచారం చేసింది. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ మచ్చలు అలాగే ఉన్నాయి." అని అన్నారు.


గర్భవతి అయిన అనిమా దాస్ బంగ్లాదేశ్ నుండి పారిపోయి భారత్ కు చేరుకుంది. ఆ సమయంలో ఆమె గర్భంతో ఉంది. ఆ బాధాకరమైన రోజులను ఆమె గుర్తుచేసుకుంటూ, "నా కొడుకు చాలా చిన్నవాడు, నా కుమార్తె నా కడుపులో ఉంది. బంగ్లాదేశ్ లో ఘర్షణ వాతావరణం ఉంది. ఇళ్ళు తగలబడ్డాయి. భయంతో మా అత్త మమ్మల్ని భారతదేశానికి పంపారు." అని తెలిపారు. అసలు కలలో కూడా ఊహించని హింసను చూశానని ఆమె గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా పురుషులపై జరిగిన హింసను అసలు మరచిపోలేను. "నేను బంగ్లాదేశ్‌ను కొన్ని సార్లు సందర్శించాను, కానీ అక్కడ మళ్లీ నివసించాలనే ఆలోచన నాకు లేదు." అని అనిమా దాస్ వెల్లడించారు.

సరిహద్దు ప్రాంతాలకు చెందిన పలువురు వ్యక్తులు ఇదే భావాలను వ్యక్తం చేశారు. చాలామంది తమ పూర్వీకుల ఇళ్లను, అక్కడి జ్ఞాపకాలను విడిచిపెట్టి, మతపరమైన హింస కారణంగా పారిపోయామన్నారు. భారతదేశం అందించే భద్రత తమకు ఉపశమనం కలిగిస్తోందని.. దేశమంటే తమకు కృతజ్ఞతా భావం ఉందన్నారు. బంగ్లాదేశ్‌లోని హిందువులు వీలైతే భారతదేశంలో ఆశ్రయం సంపాదించాలని వారు హితవు పలుకుతూ ఉన్నారు.



 బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన హరధన్ బిస్వాస్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ లో హిందూ సమాజం నిరంతరం భయం గుప్పిట్లో ఉందని.. చాలా మంది తమ మాతృభూమిని విడిచిపెట్టి భారతదేశంలో ఆశ్రయం పొందవలసి వస్తుందన్నారు. "హిందువులు చారిత్రాత్మకంగా బంగ్లాదేశ్‌లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు, స్వాతంత్ర్యం పొందిన సమయం నుండి పాకిస్థాన్ నుండి విముక్తి కోసం జరిగిన యుద్ధం వరకూ హిందువులు చాలా కష్టాలే పడ్డారు." అని తెలిపారు.


1956లో భారతదేశానికి వచ్చిన పరేష్ దాస్ తనకు ఎదురైన ఒక బాధాకరమైన అనుభవాన్ని పంచుకున్నారు. "నా కళ్ల ముందే మా తాతయ్యను నరికి చంపారు. భయంతో మా భూమిని వదిలేశాం. నా కళ్లముందే మా కజిన్‌పై దాడి చేశారు. ప్రస్తుతం భారతదేశంలో శాంతియుతంగా జీవిస్తున్నప్పటికీ బంగ్లాదేశ్ లో ఉన్న మా బంధువులు బెదిరింపులకు గురవుతున్నారు. నెల రోజుల క్రితం భూ తగాదాల కారణంగా మామయ్య హత్యకు గురయ్యాడు. " అని తెలిపారు.

భారత ప్రభుత్వం జోక్యం
: 


న్యూటౌన్ సమీపంలో నివాసం ఉంటున్న రషోమోయ్ బిస్వాస్, 1971 తర్వాత జరిగిన వేధింపులను వివరించాడు. "బంగ్లాదేశ్ లో హిందువుగా ఉండటం నేరం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఉపశమనం లేదు. పాకిస్తాన్ సైన్యం, జమాత్ బలగాలు మమ్మల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతూనే ఉన్నారు, హిందువులను అతి దారుణంగా హింసించారు." అని తెలిపారు. ''నా కుటుంబం ఆహారం కూడా లేకుండా గడిపేసేది. మేము ఇప్పుడు భారతదేశంలో శాంతియుతంగా జీవిస్తున్నా, మా బంధువులు చాలా మంది బంగ్లాదేశ్‌లో ఉన్నారు. అక్కడ హిందువులు నిర్భయంగా జీవించేలా భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని మేము కోరుతున్నాము." అని కోరారు.


Tags:    

Similar News