National Girl Child Day: జాతీయ బాలికా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారంటే?
కేంద్ర ప్రభుత్వం 2008 నుంచి జనవరి 24ను నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా ప్రకటించింది;
జనవరి 24న ‘నేషనల్ గర్ల్ చైల్డ్ డే’(జాతీయ బాలికల దినోత్సవం) జరుపుకొంటారు.బేటీ బచావో-బేటీ పఢావో పథకాన్ని తీస్కోచ్చాని సందర్బంగా భారత ప్రభుత్వం 2008 నుంచి జనవరి 24ను నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా ప్రకటించింది. ఆడపిల్లల్లో సామాజిక అవగాహన(అవేర్ గర్ల్ చైల్డ్-ఎబుల్) పెంచడమే కాకుండా.. విద్య, ఆరోగ్య రంగాల్లో బాలికలు మరింత చురుకుగా ఉండేలా చూడటం కోసం ఈ రోజును ప్రత్యేకంగా కేటాయించారు.మాహిళా శిశు అభివృద్ధి, మంత్రిత్వ శాఖ ద్వారా ఆడపిల్లలకు అడ్డుగా ఉన్న ఎన్నో విషయాలపై పోరాడడానికి కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ బాలిక అభివృద్ధి మిషన్’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆడపిల్లల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. సమాజంలో బాలికల సంరక్షణ పట్ల, బాలికల హక్కులు, వైద్య సంరక్షణ, విద్య, పోషకాహారం,వివాహం సామాజిక ఎదుగుదల వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ ఏటా జనవరి 24ను ‘జాతీయ బాలిక దినోత్సవం’గా నిర్వహిస్తోంది కేంద్రం.