IPL 2025 : నేడు మరో హైటెన్షన్ మ్యాచ్
ఐపీఎల్ నేడు మరో సూపర్ మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడుతుంది;

ఐపీఎల్ నేడు మరో సూపర్ మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడుతుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ఇప్పటి వరకూ చెన్నైలో జరిగిన మ్యాచ్ లలో ఒక దానిలో బెంగళూరు విజయం సాధించింది. మిగిలినవన్నీ చెన్నై ఖాతాలోనే పడ్డాయి. రెండు జట్లు ఇప్పటికే చెరో జట్టుపై గెలిచి రెండు పాయింట్లతో ఉన్నాయి. తమ సొంత గడ్డపైన జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై ఇప్పటికే ముంబయి ఇండియన్స్ ను ఓడించింది.
సమఉజ్జీలు మైదానంలో...
ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. అయితే ఇరు జట్లలో మంచి బ్యాటర్లున్నారు. సమయానికి వికెట్లు తీసే బౌలర్లున్నారు. ముఖ్యంగా ధోనీ, కోహ్లీ ఒకే మైదానంలో కనపడుతుండటంతో క్రికెట్ ఫ్యాన్స్ స్టేడియంలో ఊగిపోతారని చెప్పకతప్పదు. చెవులు దద్దరిల్లే సౌండ్ తో నినాదాలు కూడా చేస్తారు. చెన్నైకు ముగ్గురు స్పినర్లు బెంగళూరు ను దెబ్బతీసేందుకు మరోసారి రెడీగాఉన్నారు. ఇక బ్యాటింగ్ లలో ఇరు జట్లు కూడా సమానమైన బలం ఉండటంతో ఈ మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తుందని చెప్పకతప్పదు.