IPL 20225 : దంచుడే దంచుడు... శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చూసి తీరాల్సిందేగా
అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ పై గెలిచింది.;

ఐపీఎల్ లో జరుగుతున్న ఒక్కొక్క మ్యాచ్ ప్రతి క్రికెట్ ఫ్యాన్ ను అలరిస్తుంది. ఐపీఎల్ అంటేనే అంతే మరి. ఎన్ని షాట్లు... సిక్సర్లు.. ఫోర్లతో విధ్వంసం సృష్టిస్తూ ఐపీఎల్ లో సరికొత్త రికార్డులను కుర్రోళ్లు నెలకొల్పుతున్నారు. ఐపీఎల్ 18 ప్రారంభమయిన అన్ని మ్యాచ్ లు చివరి ఓవర్ వరకూ టెన్షన్ పెట్టినవే. నిన్న అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ పై గెలిచింది. చివరి ఓవర్ వరకూ టెన్షన్ కొనసాగింది. తొలుత టాస్ పడిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ చూసి తీరాల్సిందే. శశాంక్ సింగ్ శ్రేయస్ అయ్యర్ కు సెంచరీ అవకాశం ఇవ్వకుండానే బాదడంతో తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.
తొలుత బ్యాటింగ్ చేసి...
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు 243 పరుగులు చేసింది. ఐదు వికెట్లను మాత్రమే కోల్పోయింది. తొలుత వికెట్లు రెండు పడిపోయినా ఢిల్లీ కాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లతో టైటాన్స్ పై విరుచుకపడ్డాడు. శంశాంక్ సూపర్ ఇన్నింగ్స్ ఆడి 44 పరుగులు చేశాడు. తొలుత ప్రియాంశ్ ఆర్య కూడా అర్ధ సెంచరీని తృటిలో మిస్ చేసుకున్నాడు. 47 పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో పంజబాబ్ కింగ్స్ ఐదు వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది.
సెంచరీ మిస్ అయినా...
శశాంక్ చివరి ఓవర్లలో చేసిన పరుగులే ఢిల్లీ విజయానికి కారణమని చెప్పకతప్పదు. శ్రేయస్ అయ్యర్ సెంచరీ మిస్ అయ్యేలా శశాంక్ సింగ్ వ్యవహరించారని భావించిన ఫ్యాన్స్ కు తర్వాత టైటాన్స్ 11 పరుగుల తేడాతోనే ఓటమి పాలు కావడంతో శశాంక్ చివరి ఓవర్ లో సాధించిన అత్యంత వేగమైన పరుగులే విజయాన్ని తెచ్చి పెట్టాయని చెప్పాలి. ఐపీఎల్ లో ఇది పెద్ద స్కోరేమీ కాదని భావించినా గుజరాత్ టైటాన్స్ దూకుడు చూసి శశాంక్ వల్లనే విజయం దక్కిందని అనుకోవాల్సి ఉంటుంది. గుజరాత్ టైటాన్స్ లో సుదర్శన్ 74 పరుగులు చేసి మురిపించాడు. బట్లర్ 54 పరుగులు చేసి తన సహకారన్ని అందించాడు. రూథర్ ఫర్డ్ 46 పరుగులు చేసినా ప్రయోజనం లేకపోయింది. చివరకు తక్కువ పరుగులతో ఢిల్లీ టైటాన్స్ పై గుజరాత్ టైటాన్స్ ఓటమి పాలు కావాల్సి వచ్చింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఒకటి, సాయికిశోర్ మూడు, రబడ, ఒక వికెట్ తీశారు. ఢిల్లీ కాపిటల్స్ జట్టులో అర్షదీప్ రెండు యాన్సెన్ ఒకటి, మ్యాక్స్ వెల్ ఒక వికెట్ మాత్రమే తీయగలిగారు.