BCCI ప్రెసిడెంట్‌గా ఉన్న సౌరవ్ గంగూలీ నిష్క్రమణపై తీవ్ర ఊహాగానాలు చెలరేగాయి. మరీ ఇంత పాలిటిక్స్ ఉంటాయా అంటూ అభిమానులు కూడా విమర్శలు చేశారు. BCCI కోశాధికారి, తదుపరి IPL ఛైర్మన్ అరుణ్ ధుమాల్ గంగూలీ గురించి వస్తున్న వార్తలన్నిటినీ ఒక్క మాటలో కొట్టేశారు. గంగూలీకి వ్యతిరేకంగా "ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు" అని ధుమాల్ వెల్లడించారు. గంగూలీ పని తీరుపై బీసీసీఐలో ప్రతీ సభ్యుడు సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారని బోర్డు కోశాధికారి, ఐపీఎల్ కు చైర్మన్ కాబోతున్న అరుణ్ ధుమల్ చెప్పారు. సౌరవ్ కి వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదంటున్నారు. గంగూలీ సహా అందరినీ సంప్రదించిన తర్వాత, ఏకాభిప్రాయంతోనే బోర్డు తదుపరి అధ్యక్షుడిగా రోజర్ బిన్నీని ఎంపిక చేసినట్లు తెలిపారు. 'దాదా గురించి మీడియాలో వచ్చినవన్నీ ఊహాగానాలే. కొంతమంది సభ్యులు ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారనే వార్తలు నిరాధారమైనవి. తనకు వ్యతిరేకంగా ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దాదా పట్ల మొత్తం బోర్డు సభ్యులందరూ చాలా సంతోషంగా, సంతృప్తి చెందారు.' అంటూ వ్యాఖ్యలు చేశారు. గంగూలీ నిష్క్రమణ వెనుక ఎలాంటి రాజకీయాలు లేవని కూడా ధుమాల్ నొక్కి మరీ చెప్పారు. "అందులో నిజం లేదు. మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నందున ప్రజలు విభిన్న భావజాలాన్ని కలిగి ఉండవచ్చు. బీసీసీఐ విషయానికి వస్తే అందరి దృష్టి భారత క్రికెట్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపైనే ఉంటుంది" అని అన్నారు.