
ఈ ఏడాది ప్రారంభంలో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు నుండి తనను తొలగించిన తర్వాత చాలా బాధపడ్డానని పేసర్ మహమ్మద్ సిరాజ్ తెలిపారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ 4/17 స్కోరుతో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ప్రెజెంటేషన్ కార్యక్రమంలో సిరాజ్ మాట్లాడుతూ, "ఒకానొక సమయంలో ఆ నిర్ణయాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను (ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక అవ్వకపోవడం) కానీ నేను నా ఫిట్‌నెస్, ఆటపై పనిచేశాను" అని అన్నారు.
గత సీజన్ వరకూ ఆర్సీబీకి ఆడాను, ఇప్పుడు గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నానని తెలిపారు. బౌలింగ్‌పై చాలా కఠినంగా శ్రమించానని అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆడిన భారత జట్టుకు ఎంపిక కాలేనందుకు మనస్థాపానికి గురయ్యా. ఒక దశలో నేను ఆ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయానన్నారు. అయితే కష్టపడేతత్వాన్ని మాత్రం వదల్లేదన్నారు. గతంలో ఏ తప్పులు చేశానో.. వాటిపై దృష్టిపెట్టానన్నారు సిరాజ్. సొంత మైదానంలో ఆటడం ఎప్పుడూ స్పెషలేనని, ఆ అనుభూతి ప్రత్యేకంగా ఉంటుందన్నారు సిరాజ్. ప్రేక్షకుల్లో తన కుటుంబసభ్యులు ఉన్నారని సిరాజ్ తెలిపారు.