Dhoni: అప్పుడే రిటైర్మెంట్ తీసుకుని ఉంటే బాగుండేది
చెన్నై సూపర్ కింగ్స్ IPL 2023 టైటిల్ విజయం తర్వాత;

చెన్నై సూపర్ కింగ్స్ IPL 2023 టైటిల్ విజయం తర్వాత MS ధోని రిటైర్ అయి ఉండాల్సిందని భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తెలిపారు. ధోని అభిమానుల గౌరవాన్ని నెమ్మదిగా కోల్పోతున్నాడని మనోజ్ తివారీ అభిప్రాయపడ్డారు. చెన్నై సూపర్ కింగ్స్ లైనప్‌లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న ధోని ఈ సీజన్‌లో ప్రభావం చూపడంలో విఫలమయ్యాడు. చెన్నై లీగ్ దశలో వరుస ఓటములతో ఇబ్బంది పడుతోంది.
ఇప్పటివరకు 4 మ్యాచ్‌లలో.. ధోని 76 పరుగులు చేశాడు. కానీ అభిమానులు అతడు వస్తున్న బ్యాటింగ్ స్థానాన్ని ప్రశ్నించారు. ఏప్రిల్ 5, శనివారం DC తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయింది. CSK లెజెండ్ 26 బంతుల్లో 30 పరుగులు మాత్రమే చేశాడు. 2023 ఫైనల్ ధోని రిటైర్ కావడానికి సరైన సమయం అని తివారీ భావించాడు. అభిమానులు ధోని ఆట తీరును ఎంజాయ్ చేయలేకపోతున్నారని, ఆ మ్యాజిక్ ఇకపై పనిచేయడం లేదని భారత మాజీ క్రికెటర్ అన్నారు. అభిమానులు ధోని ఇలా ఆడుతుంటే అసలు చూడలేకపోతున్నారని తివారీ అన్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. 184 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడంలో సీఎస్కే విఫలమైంది. 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. విజయ్ శంకర్ 54 బంతుల్లో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఎంఎస్ ధోనీ 26 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్ నిలిచాడు.