IPL 2025 : నేడు రెండు మ్యాచ్ లు .. క్రికెట్ ఫ్యాస్స్ కు పండగే
ఐపీఎల్ లో ఈరోజు అదిరిపోయే రెండు మ్యాచ్ లు జరగనున్నాయి.చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ కాపిటల్స్ తో తలపడుతుంది. పంజాబ్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ ఆడుతుంది.;

ఐపీఎల్ లో ఈరోజు అదిరిపోయే రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. దీంతో ఈరోజంతా క్రికెట్ ఫ్యాస్స్ చూసినోళ్లకు చూసింనంత. ఎందుకంటే నాలుగు జట్లు మంచి ఫామ్ లో ఉన్న జట్లు కావడంతో ఈ రెండు మ్యాచ్ లు అలరించనున్నాయి. రెండు మ్యాచ్ లు వేర్వేరు చోట్ల వేర్వేరు సమయాలలో జరుగుతున్నందున క్రికెట్ ఫ్యాన్స్ తనివి తీరా మైదానంలో తమ అభిమాన ఆటగాళ్లను చూసే వీలుంది.
హేమాహేమీలు...
చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ కాపిటల్స్ తో తలపడుతుంది. చెన్నైలో ఈరోజు మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఢిల్లీ కాపిటల్స్ మంచి ఊపుమీద ఉంది. చెన్నై కాపిటల్స్ మాత్రం పడి లేస్తూ వస్తుంది. మరి చివరకు ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి. మరో మ్యాచ్ పంజాబ్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ ఆడుతుంది. ఇది కూడా అంతే. పంజాబ్ కింగ్స్ జోరు మీదుండగా రాయల్స్ తడబడుతూ వస్తుంది. మొత్తం ఈ ఎవరు గెలిచినా ఉత్కంఠ భరితంగా సాగనున్నాయి.