నేడు భారత్ - న్యూజిలాండ్ మధ్య తొలి టెస్ట్

నేడు భారత్ - న్యూజిలాండ్ మధ్య తొలి టెస్ట్ జరగనుంది. బెంగళూరు వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో అనేక రికార్డులు బ్రేక్ కానున్నాయి

Update: 2024-10-16 02:29 GMT

India and New Zealand 2024

నేడు భారత్ - న్యూజిలాండ్ మధ్య తొలి టెస్ట్ జరగనుంది. బెంగళూరు వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో అనేక రికార్డులు బ్రేక్ కానున్నాయి. రోహిత్ సేన బలంగా ఉంది. వరస విజయాలతో అది బలంగా ఉంది. పటిష్టమైన బౌలింగ్, బ్యాటింగ్ తో సొంత గడ్డ కావడంతో భారత్ కు మరింత అనుకూలమైన అంశమని క్రీడానిపుణులు చెబుతున్నారు. అయితే బెంగళూరులో వాతావరణమే సహకరిచేందుకు అవకాశం కనిపించడం లేదు. మ్యాచ్ కు వర్షం పొంచి ఉండే అవకాశముంది. భారత్ వరసగా స్వదేశంలో 19వ టెస్ట్‌ సమరానికి సిద్ధమయింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది.

బలమైన జట్లు కావడంతో...
న్యూజిలాండ్ తో మూడు మ్యాచ్ ల సిరీస్ ను గెలవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగుతుంది. అయితే కివీస్ ను కూడా అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. అది కూడా బలంగానే ఉండటంతో పోరు రసవత్తరంగా సాగనుందని చెబుతున్నారు. బంగ్లాదేశ్ మాదిరిగా వన్ సైడ్ కాకుండా రెండు జట్లు బలమైనవే కావడంతో క్రికెట్ అభిమానులకు ఈరోజు నుంచి మంచి ఫీస్ట్ అని చెప్పాలి. భారత్ పెద్దగా జట్టులో మార్పులు లేకుండానే బరిలోకి దిగుతుంది. శుభమన్ గిల్, యశస్వి జైశ్వాల్ మంచి ఫామ్ లో ఉన్నారు. రోహిత్ శర్మ, కోహ్లి కూడా ఉండటంతో బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్ గా ఉంది. మహ్మద్ సిరాజ్, బుమ్రా, అశ్విన్, జడేజా వంటి బౌలర్లు న్యూజిలాండ్ పతనాన్ని శాసిస్తారని అంచనా వేస్తున్నారు.


Tags:    

Similar News