India Vs Bangladesh First Test : తొలి టెస్ట్ మనదేనట.. బంగ్లా ఆశలు గల్లంతే

భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ లో టీం ఇండియా భారీ ఆధిక్యతలో ఉంది.;

Update: 2024-09-22 04:38 GMT
india,  bangladesh, first test, chennai
  • whatsapp icon

భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ లో టీం ఇండియా భారీ ఆధిక్యతలో ఉంది. అత్యధిక పరుగులు చేసి బంగ్లాదేశ్ ను ఓటమి వైపునకు నెట్టింది. సమిష్టిగా టీం ఇండియా ఆటగాళ్లు రాణించడంతో ఈ టెస్ట్ లో భారత్ ముందంజలో ఉంది. బంగ్లాదేశ్ కంటే 515 పరుగుల ఆధిక్యంతో ఉంది. అయితే ఇప్పటికే బంగ్లాదేశ్ నాలుగు వికెట్లు కోల్పోవడంతో భారత్ పై గెలవడం కానీ, మ్యాచ్ ను డ్రా చేయడం కానీ జరిగే అవకాశాలు లేవని క్రీడా నిపుణులు చెబుతున్నారు.

తొలి టెస్ట్ లో...
ఏదైనా అద్భుతం జరిగితే తప్ప చెన్నైలో జరుగుతున్న తొలి టెస్ట్ డ్రా కాదు. టెస్ట్ విజయం భారత్ వైపు మొగ్గు చూపుతుంది. మొత్తం రెండు టెస్ట్‌లలో భారత్ తొలి టెస్ట్‌ లోనే సత్తా చాటింది. పాకిస్థాన్ మీద గెలిచి తాము ఫామ్ లో ఉన్నారని భావించిన బంగ్లాదేశ్ ను టీం ఇండియా ఆటగాళ్లు చెక్ పెట్టగలిగారు. రిషబ్ పంత్, శుభమన్ గిల్ లు సెంచరీలు చేసి భారత్ భారీ ఆధిక్యతను సాధించిపెట్టారు. నాలుగో రోజే గేమ్ ఎవరిది అన్నది తేలిపోనుంది.


Tags:    

Similar News