ఉప్పల్ లో మ్యాచ్.. వెళుతున్న వారు తెలుసుకోవాల్సిన విషయాలివే..!

ఈ మ్యాచ్‌కు రాచకొండ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఉప్పల్‌ పరిసరాలలో

Update: 2022-09-24 09:19 GMT

ఆదివారం నాడు హైదరాబాద్ లోని ఉప్పల్ లో మ్యాచ్ జరగబోతోంది. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఇప్పటికే 1-1 తో సమమైంది. నిర్ణయాత్మక మూడో టీ20 హైదరాబాద్ లో జరుగుతూ ఉండడం.. వర్షానికి కూడా ఆస్కారం లేదని చెబుతూ ఉండడంతో అభిమానులు మ్యాచ్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. టికెట్స్ విషయంలో చోటు చేసుకున్న రచ్చ గురించి దేశమంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక రేపు బ్లాక్ లో కూడా భారీగా టికెట్లు అమ్ముతారని.. అక్కడే ఎంత ఖర్చు అయినా కొనుక్కుందామని వెళ్లే వాళ్లు కూడా ఉన్నారు. అయితే బ్లాక్ లో టికెట్స్ అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చెబుతోంది. రెండు జట్లు ఈ రోజు సాయంత్రం 5:45 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నాయి. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రెండు టీం అటగాళ్ళను భారీ పోలీసు బందోబస్తూ మద్య నగరంలోని స్టార్ హోటల్ కు తరలించనున్నారు.

ఈ మ్యాచ్‌కు రాచకొండ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఉప్పల్‌ పరిసరాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్ వెల్లడించారు. కెమెరాలు, సెల్ఫీస్టిక్స్ సిగరెట్లు, అగ్గిపెట్టెలు, పదునైన ఆయుధాలు, ఆల్కహాల్‌, తిను బండారాలు, వాటర్‌ బాటిల్స్‌, హెల్మెట్‌లను లోపలికి అనుమతించమని సీపీ స్పష్టం చేశారు. ఇక మ్యాచ్ కు వచ్చే క్రికెట్ అభిమానులను ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి స్టేడియంలోకి అనుమతిస్తామని చెప్పారు. టిక్కెట్లు ఉన్న వారు మాత్రమే రావాలని సూచించారు.
క్రికెట్‌ మ్యాచ్‌ చూడడానికి వచ్చే ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక సిటీ బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ సికింద్రాబాద్‌ రీజియన్‌ మేనేజర్‌ సీహెచ్‌ వెంకన్న తెలిపారు. సికింద్రాబాద్‌, జేబీఎస్‌, మేడ్చల్‌, హకీంపేట్‌, జీడిమెట్ల, ఘట్‌కేసర్‌, కోఠి, మోహిదీపట్నం, పటాన్‌చెరు వంటి వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్‌ స్టేడియం వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నారు.


Tags:    

Similar News