India Vs England Third ODI : అహ్మదాబాద్ లో భారీ స్కోరు చేసిన భారత్
భారత్ - ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు చేసింది.;

భారత్ - ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు చేసింది. యాభై ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ సీనియర్ ఆటగాళ్లు రాణించడంతో ఈ స్కోరు సాధ్యమయింది. శుభమన్ గిల్ సెంచరీ చేయగా విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ లు అర్థ సెంచరీ చేశారు. కేఎల్ రాహుల్ సయితం నలభై పరుగులు చేసి ఎల్.బి.డబ్ల్యూగా వెనుదిరిగాడు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఇంగ్లండ్ ఎదుట...
దీంతో ఇంగ్లండ్ ముందు భారత్ భారీ స్కోరు ఉంచినట్లయింది. ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్ నాలుగు వికెట్లు తీశాడు. స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్న ఈ పిచ్ లో వారిదే పై చేయి అయింది. భారత్ తో ఇంగ్లండ్ మూడు వన్డే మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచి టీం ఇండియా సిరీస్ ను గెలుచుకుంది. ఇక రోహిత్ శర్మ తక్కువ పరుగులకే అవుటయ్యాడు. ఇంగ్లండ్ ఎదుట 357 పరుగుల లక్ష్యం ఉంది. స్పిన్నర్లు కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఉన్నారు. వాషింగ్టన్ కూడా తన బంతితో మెరుపులు మెరిపించే అవకాశాలున్నాయి.