India Vs New Zealand Second Test : ఇక వేస్ట్ భయ్యా... బ్యాగ్‌లు సర్దేసుకోండి.. ఇంత దారుణమైన ఓటమా?
భారత్ న్యూజిలాండ్ చేతిలో దారుణంగా ఓటమి పాలయింది. సిరీస్ ను కివీస్ కైవసం చేసుకుంది.
భారత్ న్యూజిలాండ్ చేతిలో దారుణంగా ఓటమి పాలయింది. సిరీస్ ను కివీస్ కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ లో న్యూజిలాండ్ వరసగా బెంగళూరు, పూణేలలో గెలవడంతో భారత్ సొంత గడ్డపై చేతులెత్తేసినట్లయింది. బెంగళూరులోనూ, పూణేలోనూ భారత్ పేలవ ప్రదర్శన చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 46 పరుగులు చేసింది. ఇంత దారుణంగా భారత్ ఆడి బెంగళూరు మ్యాచ్ ను చేజార్చకుంది. పూణేలోనూ గత మ్యాచ్ నుంచి భారత్ బ్యాటర్లు గుణపాఠం నేర్చుకోలేదు. ముఖ్యంగా సీనియర్లందరూ బ్యాటింగ్ చేయలేక ఇబ్బంది పడుతుండటం ఈ టెస్ట్‌లలోనే చూశాం.
113 పరుగుల తేడాతో...
359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 113 పరుగుల తేడాతో ఓటమి పాలయింది. కేవలం 245 పరుగులకే ఆల్ అవుట్ అయింది. భారత్ ఆటగాళ్లలో ఒక్క యశస్వి జైశ్వాల్ 77 పరుగులతో కొద్దిగా రాణించారు. తర్వాతజడేజా కొద్దో గొప్పో స్కోరు చేశారు. న్యూజిలాండ్ బౌలర్ తొలి ఇన్నింగ్స్ లో మిచెల్ శాంటర్న్ ఏడు వికెట్లు తీశారు. సెకెండ్ ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు తీసి భారత్ వెన్నువిరిచారు. న్యూజిలాండ్ కు రికార్డు భారత్ చేజేతులా అందించింది. ఇప్పటివరకూ భారత్ గడ్డపై టెస్ట్ సిరీస్ ను గెలవలేదు. మూడో టెస్ట్ ముంబయిలో ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు ఏమైంది? అని క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
నిర్లక్ష్యమేనా?
సొంత గడ్డపైనే ఇంతటి చెత్త ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు బీసీసీఐ ఏం చేస్తుందన్న ప్రశ్నను నెటిజన్లు సంధిస్తున్నారు. సీనియర్ ఆటగాళ్ల నిర్లక్ష్యమా? లేక ఫామ్ ను కోల్పోయి లేటు వయసులో కాలు కదపలేక, బ్యాటు తిప్పలేక అవస్థలు పడుతున్నారా? అన్న అనుమానాలు కూడా క్రికెట్ ఫ్యాన్స్‌లో బయలుదేరాయి. ఇంత దారుణమైన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. వరసగా ఓటములను చవిచూస్తున్న ఈ జట్టుపై నిర్దాక్షిణ్యంగా వేటు వేయాలంటూ బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకోవాలంటూ క్రికెట్ ఫ్యాన్స్ ఎక్స్ లో డిమాండ్ చేస్తున్నారు. టెస్ట్ జట్టులోనూ విఫలమవుతారని తెలిసినా నవతరం ఆటగాళ్లకు చోటు కల్పిస్తే మేలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.