India vs Australia T20 : ఇండియా బ్యాటర్లు మామూలుగా ఆడటం లేదుగా
ఇండియా - ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తుంది
ఇండియా - ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తుంది. ఇండియా బ్యాటర్లు ఆసిస్ బౌలర్లను చితకబాదుతున్నారు. సిక్సర్లు, ఫోర్లతో స్టేడయం నలువైపులా బంతులు బాదుతున్నారు. యశస్వి జైశ్వాల్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్ లు క్రీజులోకి వచ్చారు. యశస్వి జైశ్వాల్ యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు. అయితే 23 బంతులను ఎదుర్కొనియాభై మూడు పరుగుల తర్వాత యశస్విజైశ్వాల్ అవుట్ అయ్యాడు
ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ...
తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ కూడా నిలదొక్కుకుని ఆడుతున్నాడు. రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ లు ఇద్దరు అంది వచ్చిన బంతిని బౌండరీలైన్లకు తరలిస్తున్నారు. ఇషాన్ కిషన్ 29 బంతుల్లోనే యాభై పరుగులుపూర్తి చేసుకున్నాడు. భారత్ బ్యాటర్లు ఇద్దరినీ విడదీయడం కంగారూలకు కష్టంగా మారింది. చివరకు ఇషాన్ కిషన్ వికెట్ ను ఆసీస్ చేజిక్కించుకుంది. రుతురాజ్ గైక్వాడ్ కూడా హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నారు. 47 పరుగులు చేశాడు. దీంతో 15.3 ఓవర్టలకు రెండు వికెట్లు కోల్పోయిన ఇండియా 170 పరుగులు చేసింది. తర్వాత సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చారు.