India Vs Bangladesh T20 : నేడు హైదరాబాద్‌లో మూడో టీ20
నేడు భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య చివరి టీ20 మ్యాచ్ హైదరాబాద్‌లో జరగనుంది.
నేడు భారత్ - బంగ్లాదేశ్‌ల మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను సొంతం చేసుకున్న టీం ఇండియా మూడు టీ 20లలో వరసగా రెండు టీ20లలో విజయం సాధించి టీ 20 సిరీస్ ను కూడా గెలుచుకుంది. ఈ మ్యాచ్ నామమాత్రమే. సిరీస్ టీం ఇండియా సొంతం కావడంతో మూడో టీ 20లో ఇండియా కొన్ని ప్రయోగాలు చేసే అవకాశముంది. కొందరికి విశ్రాంతినిచ్చి మరికొందరు యువకులను జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. రాత్రి ఏడు గంటలకు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. వర్షం కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
క్లీన్ స్వీప్ చేయాలని...
ఈ మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తుండగా, ఒక్క మ్యాచ్‌లోనైనా గెలవాలని బంగ్లాదేశ్ శ్రమిస్తుంది. ప్రస్తుతం టీం ఇండియా జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్ పరంగా సత్తా చాటుతోంది. అందరూ ఫామ్ లో ఉండటం భారత్ కు కలసి వచ్చే అంశం కాగా, బౌలింగ్ లో కొన్ని మార్పులు జరిగే అవకాశముందని చెబుతున్నారు. ఇక ఉప్పల్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం కావడంతో పరుగుల వరద పారే అవకాశముంది. ఈ పిచ్ మీద టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. ఈరోజు హైదరాబాద్ లో పండగ నాడు ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారక తప్పదు. క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే.