India Vs Newzeland Second Test : నేటి నుంచి ఇండియా - న్యూజిలాండ్ రెండో టెస్ట్

నేడు ఇండియా - న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. పూణేలో జరగనున్న మ్యాచ్ సిరీస్ ఎవరిదో తేల్చనుంది

Update: 2024-10-24 02:59 GMT

నేడు ఇండియా - న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. పూణేలో జరగనున్న మ్యాచ్ సిరీస్ ఎవరిదో నిర్ణయించనుంది. న్యూజిలాండ్ గెలిస్తే ఈ సిరీస్ గెలిచినట్లే. భారత్ గెలిస్తే రెండు సమం అవుతాయి. అందుకే భారత్ కు ఈ మ్యాచ్ కీలకం అని చెప్పాలి. పూణేలో జరుగుతున్న టెస్ట్‌లో బౌలర్లు న్యూజిలాండ్ ను కట్టడి చేయాలంటే భారత్ భారీ పరుగులు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ కు దిగితే దానిని కట్టడి చేయాల్సిన బాధ్యత బౌలర్లపై ఉంది. తక్కువ స్కోరుకు ఆల్ అవుట్ చేయగలిగితే రెండో టెస్ట్ లో భారత్ కు విజయం సాధ్యమవుతుంది.

న్యూజిలాండ్‌లో ఉత్సాహం...
అదే సమయంలో న్యూజిలాండ్ రెట్టించిన ఉత్సాహంతో ఉంది. బెంగళూరు టెస్ట్ లో గెలిచిన ఉత్సాహంతో రెండో టెస్ట్‌లోనూ గెలిచి చూపించాలని న్యూజిలాండ్ తహతహలాడుతుంది. తొలి టెస్ట్ లో ఓటమితో ఐసీసీ ర్యాంకింగ్ లో స్థానాన్ని దిగజార్చుకుంది. అందుకే భారత్ కు పూణే టెస్ట్ అన్ని రకాలుగా పరీక్ష అని చెప్పాలి. గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. డ్రా చేసినా ఫలితం ఉండదు. ఖచ్చితంగా గెలిస్తేనే పైచేయి సాధించి మూడో టెస్ట్ లో అమితుమీ న్యూజిలాండ్ పై తేల్చుకోవడానికి సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో భారత్ జట్టులో కొన్ని కీలక మార్పులతో దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కొద్దిపాటి మార్పులతో...
ఇది స్పిన్నర్లకు పెద్దగా అనుకూలించదని క్రీడా పండితులు చెబుతున్నారు. తొలి మ్యాచ్ లో సర్ఫరాజ్ ఖాన్, పంత్ కొంత ఆదుకోవడంతో కొంత మేర స్కోరు వచ్చింది. సర్ఫరాజ్ ఖాన్ తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచ్ కు శుభమన్ గిల్ కూడా అందుబాటులోకి వచ్చాడు. దీంతో కేఎల్ రాహుల్ కు అవకాశమిస్తారా? లేదా. అన్నది ఆసక్తికరంగా మారింది. సర్ఫరాజ్ ఖాన్ ఫస్ట్ మ్యాచ్ లో సెంచరీ చేయడంతో అతడిని తప్పించలేని పరిస్థితి. భారత్ ముగ్గురు స్పినర్లతో ఈ మ్యాచ్ లో ఆడటం ఖాయమని చెబుతున్నారు. అలాగే సిరాజ్ స్థానంలో ఆకాశ్ దీప్ ను తీసుకునే అవకాశముంది. మొత్తం మీద ఈ మ్యాచ్ మాత్రం భారత్ కు చావో రేవోనని చెప్పక తప్పదు.







Tags:    

Similar News