India vs Australia T20 : భారత్ భారీ స్కోరు దిశగా... యశస్వి హాఫ్ సెంచరీ
ఇండియా - ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. యశస్వి జైశ్వాల్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఇండియా - ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. యశస్వి జైశ్వాల్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్ లు క్రీజులోకి వచ్చారు. వచ్చీ రావడంతోనే సిక్సర్లు, ఫోర్లతో స్టేడియంలో మోత మోగించారు. యశస్వి జైశ్వాల్ యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు. అయితే 23 బంతులను ఎదుర్కొనియాభై మూడు పరుగుల తర్వాత యశస్విజైశ్వాల్ అవుట్ అయ్యాడు 7.2 ఓవర్లకు భారత్ 85 పరుగులు చేసింది.
టాస్ గెలిచి...
తిరువనంతపురంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ శుభారంభాన్ని ఇచ్చిందనే చెప్పాలి. బౌలర్లకు అనుకూలించే పిచ్ పై ఇద్దరు ఓపెనర్లు భారత్ కు భారీ స్కోరును సంపాదించిపెట్టారు. భారత్ బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉండటంతో భారీ స్కోరు చేసే అవకాశముంది. ఈ గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో సగటు స్కోరు 119 మాత్రమే.అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ రెండు వందలకు పైగానే స్కోరు చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ క్రీజులో ఉన్నారు.