Breaking : భారత్ దారుణ ఓటమి

భారత్ - న్యూజిలాండ్ మూడో టెస్ట్ లోనూ టీం ఇండియా ఓటమి పాలయింది.;

Update: 2024-11-03 07:44 GMT
team india,  lost, third test,  new zealand
  • whatsapp icon

భారత్ - న్యూజిలాండ్ మూడో టెస్ట్ లోనూ టీం ఇండియా ఓటమి పాలయింది. దీంతో మూడు మ్యాచ్ లను న్యూజిలాండ్ క్లీన్ స్వీప్ చేసింది. 121 పరుగులకే భారత్ బ్యాటర్లు అవుట్ కావడంతో 25 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. కేవలం 58 పరుగులను చేస్తే చాలు భారత్ గెలిచేది. ముంబయి టెస్ట్ లోనూ చేతులెత్తేసింది.

తక్కువ లక్ష్యమే అయినా...
క్రీజులో రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ లు ఉన్నారు. ఆరు వికెట్లు కోల్పోయి మరో నాలుగు వికెట్లు చేతిలో ఉండగా భారత్ వైపు ఎక్కువగా విజయం మొగ్గు చూపింది. కానీ ఈ అవకాశాన్ని కూడా భారత్ బ్యాటర్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. చేతులెత్తేశారు. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మూడో రోజునే న్యూజిలాండ్ కు విజయాన్ని అప్పగించింది.




Tags:    

Similar News