Telangana : అందరికీ తులం బంగారం ఇవ్వాల్సిందే
తెలంగాణ శాసనసభ సమావేశాలు పదో రోజు ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన వ్యక్తం చేశారు.;

తెలంగాణ శాసనసభ సమావేశాలు పదో రోజు ప్రారంభమయ్యాయి. అయితే శాసనసభ, శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన వ్యక్తం చేశారు.కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద తులం బంగారం ఇచ్చే హామీని అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. నినాదాలు చేశారు.
బీఆర్ఎస్ సభ్యుల నిరసన...
ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని, పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్నా మాట తప్పుడూ ఇప్పటి వరకూ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేయకపోవడం పై వారు నినదించారు. బంగారు కడ్డీలను పోలిన వాటిని ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటివరకు పెళ్లయిన వారికి కూడా తులం బంగారం ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీల డిమాండ్ చేశారు.