Telangana Budget : రేవంత్ సర్కార్ ప్రాధాన్యతలేంటో చూపిన బడ్జెట్

తెలంగాణ 2025 - 26 ఆర్థిక సంవత్సరానికి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అన్ని శాఖలకు నిధుల కేటాయింపు జరిగింది;

Update: 2025-03-19 06:37 GMT
mallu bhatti vikramarka, funds, budget, telangana
  • whatsapp icon

తెలంగాణ 2025 - 26 ఆర్థిక సంవత్సరానికి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అన్ని శాఖలకు నిధుల కేటాయింపు జరిగింది. సంక్షేమంతో పాటు అభివృద్ధి రంగాలకు నిధులను భారీగానే కేటాయింపులు జరిపారు. ఈ ఏడాదిలో తమ ప్రాధాన్యతలు ఏంటో బడ్జెట్ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వివరించినట్లయింది. విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపించింది. అలాగే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేసేందుకు ఈ బడ్జెట్ లో నిధుల కేటాయింపులు జరిపినట్లు బడ్జెట్ లో చూసిన అంకెలను చూస్తే అర్థమవుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

బడ్జెట్ కేటాయింపులు శాఖల వారీగా

రైతు భరోసా - రూ.18 వేల కోట్లు
వ్యవసాయ శాఖకు - రూ.24,439 కోట్లు
పశుసంవర్థక శాఖకు - రూ.1,674 కోట్లు
పౌర సరఫరాల శాఖ- రూ.5,734 కోట్లు
విద్య - రూ.23,108 కోట్లు
ఉపాధి కల్పన - రూ.900 కోట్లు
పంచాయతీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి - రూ.31,605 కోట్లు
స్త్రీ, శిశు సంక్షేమం - రూ.2,861 కోట్లు
ఎస్సీ సంక్షేమం - రూ.40,232 కోట్లు
ఎస్టీ సంక్షేమం - రూ.17,169 కోట్లు
బీసీ సంక్షేమం - రూ.11,405 కోట్లు
మైనర్టీ సంక్షేమం - రూ.3,591 కోట్లు
చేనేత- రూ.371 కోట్లు, ఐటీ - రూ.774 కోట్లు
పారిశ్రామిక రంగం - రూ.3,525 కోట్లు
విద్యుత్‌ - రూ.21,221 కోట్లు
వైద్యారోగ్యం - రూ.12,393 కోట్లు
పురపాలక, పట్టణాభివృద్ధి - రూ.17,677 కోట్లు
నీటిపారుదల - రూ.23,373 కోట్లు
ఆర్‌ అడ్‌ బీ - రూ.5,907 కోట్లు
పర్యాటక రంగం - రూ.775 కోట్లు
సాంస్కృతిక రంగం - రూ.465 కోట్లు
అడవులు-పర్యావరణం - రూ.1,023 కోట్లు
దేవాదాయ, ధర్మాదాయ శాఖ - రూ.190 కోట్లు
శాంతిభద్రతలు - రూ.10,188 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లకు - రూ.22,500 కోట్లు
హోంశాఖ-రూ.10,188 కోట్లు
క్రీడలు - రూ.465 కోట్లు
గృహజ్యోతి, ఉచిత విద్యుత్‌ కు - మూడు వేల కోట్లు
ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల కోసం రూ.11,600 కోట్లు


Tags:    

Similar News