Telangana : తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా
తెలంగాణ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి;

తెలంగాణ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. నిన్న రాత్రి వరూ జరిగిన సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఆమోదించుకుంది. అనేక బిల్లులపై చర్చించి ఆమోదించుకుంది. ప్రధానంగా ఎస్సీ రిజర్వేషన్లతో పాటు బీసీ కులగణనతో పాటు అనేక ముఖ్యమైన అంశాలకు ఈ శాసనసభ సమావేవేశాల్లో చర్చ జరిగింది.
పదకొండు రోజులు...
మొత్తం పదకొండు రోజుల పాటు జరిగిన తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం అనేక బిల్లులను సభ ముందు ప్రవేశపేెట్టి ఆమోదించుకుంది. ఫిబ్రవరి 24వ తేదీన సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన శాసనసభ సమావేశాలు మార్చి 27వ తేదీ వరకూ కొనసాగాయి. చివరకు డీ లిమిటేషన్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమోదించి పంపారు.