Telanana Budget : నిరుపేదలకు గుడ్ న్యూస్... ఇందిరమ్మ ఇళ్లకు అధిక నిధులు
ఇందిరమ్మ ఇళ్లకు తెలంగాణ బడ్జెట్ భారీగా నిధులు కేటాయింపులు జరిగాయి.;

ఇందిరమ్మ ఇళ్లకు తెలంగాణ బడ్జెట్ భారీగా నిధులు కేటాయింపులు జరిగాయి. కేవలం ఇందిరమ్మ ఇళ్ల కోసం 22,500 కోట్ల రూపాయలను కేటాయింపులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం జరిపింది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు చొప్పున 4.50 లక్షల ఇళ్లను మంజూరుచేసే విధంగా ఈ నిధులను కేటాయించినట్లు స్పష్టంగా కనపడుతుంది. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్దిదారుల మొదటి ఎంపిక ప్రక్రియ పూర్తయింది. గత నెల 26వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేయడం ప్రభుత్వం ప్రారంభించింది. గ్రామసభల్లో దరఖాస్తులను స్వీకరించడమే కాకుండా ప్రత్యేక యాప్ ను కూడా తయారు చేసి లబ్దిదారులకు అందుబాటులోకి తెచ్చారు.ప్రభుత్వం తొలి విడతలో 71,482 మంది లబ్దిదారులను ఎంపిక చేసింది
నాలుగు విడతలుగా...
దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో సొంత స్థలం ఉన్న వారికి ఇళ్ల మంజూరులో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ పథకం కింద ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఒక్కొక్క లబ్దిదారుడికి మంజూరు చేయనుంది.ఏడు వేల ఇళ్ల నిర్మాణ పనులు కూడా మొదటి దశకు సంబంధించి ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రెండో విడత లబ్దిదారుల ఎంపిక కూడా ప్రారంభమయింది. మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో 3,500 ఇళ్ల చొప్పున నిర్మించాలన్న లక్ష్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పెట్టుకున్నట్లు ఈ నిధుల కేటాయింపు చూస్తే అర్థమవుతుంది.
ఇంటికి ఐదు లక్షలు...
ఇంటి నిర్మాణాన్ని బట్టివ నాలుగు విడతలుగా ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వంమంజూరు చేయనుంది. ఇచ్చేది ఐదు లక్షలే అయినప్పటికీ లబ్దిదారుడు తమకు కేటాయించిన స్థలంలో ఎన్ని గదుల ఇంటినైనా నిర్మించుకునే వీలుండటంతో అనేక మంది జాబితాలో ఉండేందుకు పోటీ పడ్డారు. దీంతో పాటు సొంత స్థలం లేని వారు దాదాపు 60 లక్షల మంది వరకూ దరఖాస్తు చేసుకోవడంతో వారికి నిజమైన అర్హులను గుర్తించేలా చర్యలు తీసుకుంటుంది. రెండో విడతలో సొంత ఇళ్లు లేని వారికి ఇళ్ల కేటాయింపు జరగుతుంది. జిల్లా కలెక్టర్లకే లబ్దిదారుల ఎంపిక బాధ్యతను రెండో విడత అప్పగించడంతో ఇప్పటికే వారు ఈ ప్రక్రియను ప్రారంభించారు. ఈ బడ్జెట్ లో 22,500 కేటాయించడంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై పట్ల ప్రభుత్వం సీరియస్ నెస్ అర్థమవుతుందని అంటున్నారు.