Harish Rao : అసెంబ్లీలో దుమ్ము దులిపేసిన హరీశ్ రావు
తెలంగాణ బడ్జెట్ కు ఆమోదం తెలుపుతూ జరుగుతున్న చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రభుత్వ తీరును తప్పుపట్టారు;

తెలంగాణ బడ్జెట్ కు ఆమోదం తెలుపుతూ జరుగుతున్న చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. అన్నింటా ఈ ప్రభుత్వం విఫలమయిందని అన్నారు. గత బడ్జెట్ లో నీతులు చెప్పిన భట్టి విక్రమార్క మాట నిలబెట్టుకోలేదన్నారు. ఎన్నికలకు ముందు అలివి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటిని కూడా అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఉద్యోగాలు కూడా గత కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు జారీ చేసినవేనని ఆయన ఎద్దేవా చేశారు. గత ఏడాది బడ్జెట్ లో అంచనాలు పెంచి చూపారని, ప్రస్తుత బడ్జెట్ లో వాటిని తగ్గించారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
బలవన్మరణాలతో...
ప్రభుత్వ చర్యలతో రియల్ ఎస్టేట్ వ్యాపరులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఈ ప్రభుత్వం నిర్వాకంతో ఆటో కార్మికులు కూడా బలవన్మరణం పొందారన్నారు. గురుకులాల్లో సరైన భోజనం లేక 82 మంది విద్యార్థులు చనిపోయింది నిజం కాదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. రైతు రుణమాఫీ పేరిట నిలువునా ముంచారని, అందరికీ రుణమాఫీ జరగలేదని హరీశ్ రావు ఆరోపించారు. కౌలురైతులకు ఇస్తామన్న డబ్బులు ఎక్కడ అని హరీశ్ రావు నిలదీశారు. ఇరవై వేల కోట్ల రుణమాఫీ చేసినట్లు బిల్డప్ ఇచ్చారని, కానీ వాస్తవానికి అందులో నిజం లేదని హరీశ్ రావు అన్నారు. అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం విఫలమయిందని అన్నారు. కనీసం రహదారులను కూడా నిర్మించలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని, ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలని హరీశ్ రావు ఫైర్ అయ్యారు.