Telangana : కేటీఆర్ కామెంట్స్ తో సభలో గందరగోళం
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. కేటీఆర్ చేసిన కామెంట్లతో కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.;

తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. కేటీఆర్ చేసిన కామెంట్లతో కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ ప్రతి పనిలో ముప్ఫయి శాతం కమీషన్ తీసుకుంటున్నారని, పథకాలను అమలు చేయడంలోనూ కమీషన్లు తీసుకుంటున్నారని ఆయన చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. కేటీఆర్ వ్యాఖ్యలపై దుమారం రేగింది. కేటీఆర్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
ఖండించిన భట్టి...
దీంతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేటీఆర్ పై మండిపడ్డారు. మీలా బరితెగించి రాజకీయాలు తాము చేయడం లేదని, ఒళ్లుదగ్గర పెట్టుకుని మాట్లాడాలని భట్టి విక్రమార్క హెచ్చరించారు. కేటీఆర్ చేసిన కామెంట్స్ ను వెనక్కు తీసుకోవాలని, వాటిని రికార్డుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మీరే ఇలా మాట్లాడితే ఎలా అని భట్టి కేటీఆర్ పై సీరియస్ అయ్యారు. భట్టి విక్రమార్క ఒళ్లుదగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.