ఖమ్మం ఘటనలో ఒకరి మృతి
బీఆర్ఎస్ ఆత్మీయసమ్మేళనంలో జరిగిన పేలుడు ఘటనలో ఒకరు మరణించారు. పది మందికి గాయాలయ్యాయి
బీఆర్ఎస్ ఆత్మీయసమ్మేళనంలో జరిగిన పేలుడు ఘటనలో ఒకరు మరణించారు. పది మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనం వైరా నియోజకవర్గంలో జరుగుతుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా పేల్చారు. అది ఒక గుడెసె మీద పడటంతో అందులో ఉన్న గ్యాస్ సిలిండర్లు రెండు పేలిపోయాయి. సిలిండర్ల పేలుడు ధాటికి అనేక మందికి గాయాలయ్యాయి.
ఆసుపత్రిలో....
ఖమ్మం ఆసుపత్రిలో హృదయ విదారకర పరిస్థితులు నెలకొన్నాయి. బంధువులు ఆసుపత్రికి చేరుకుని రోదిస్తున్నారు. మొత్తం ముగ్గురు పోలీసులు, ఇద్దరు జర్నలిస్టులకు తీవ్రగాయాలయ్యాయి. కాళ్లు తెగి పడ్డాయి. గాయాలపాలయిన వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైరా నియోజకవర్గంలోని కారేపల్లి మండలంలోని చీమలపాడు గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా గాయపడ్డారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాత్రం తమ సమావేశానికి, పేలుడుకు సంబంధం లేదని చెబుతున్నారు.