టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితి పేరుగా మారుస్తూ తీర్మానం చేశారు

Update: 2022-10-05 07:58 GMT

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితి పేరుగా మారుస్తూ తీర్మానం చేశారు. టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. బీఆర్ఎస్ గా మారుస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో 2001లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారింది. జాతీయ పార్టీగా ఎందుకు మారుస్తున్నామో ఎమ్మెల్యేలు, మంత్రులు, 283 మంది పార్టీ నేతలకు కేసీఆర్ తొలుత వివరించారు. ఆయన బీఆర్ఎస్ పేరును అధికారికంగా ప్రకటించారు. విస్తృతస్థాయి సమావేశంలో అందరూ ఆమోదించారు.

దేశ అవసరాలను...
దేశంలో అవసరాలను దృష్టిలో ఉంచుకుని టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తున్నామని కేసీఆర్ వారికి తెలిపారు. కలసి వచ్చే పార్టీలతో కలసి రాష్ట్రాల ప్రయోజనాలు కాలురాస్తున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేవిధంగా బీఆర్ఎస్ ను తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు. కరెక్ట్ గా ముందుగా నిర్ణయించిన ముహూర్తం మేరకు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు. 1.19 నిమిషాలకు తీర్మానం చేశారు. జాతీయ రాజకీయాలే లక్ష్యంగా బీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిందన్నారు. పలు రాష్ట్రాల నేతల సమక్షంలో కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. కేసీఆర్  అధికారికంగా ప్రకటన చేసిన వెంటనే టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బాణాసంచా కాల్చి అభిమానులు పండగ చేసుకున్నారు. 


Tags:    

Similar News