టీఆర్ఎస్ కు ఐదు ఎమ్మెల్సీ స్థానాలు
తెలంగాణలో మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
తెలంగాణలో మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో మహబూబ్ నగర్ లో రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇప్పటికే నిజామాబాద్ లో ఒకటి, రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానాలు ఏకగ్రీవం కావడంతో మొత్తం 12 స్థానాలకు ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవమయినట్లంది.
నామినేషన్లు....
తెలంగాణలో జరుగుతున్న 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు మొత్తం 99 స్థానాలు దాఖలయ్యాయి. ఖమ్మం, మెదక్ లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగారు. మిగిలిన స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ప్రస్తుతం ఐదు స్థానాలు టీఆర్ఎస్ పరమయ్యాయి.