రుణమాఫీ దక్కని వారికి మంత్రి తుమ్మల గుడ్ న్యూస్
రైతు రుణమాఫీ పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. విపక్షాలు చేసిన విమర్శలకు ఆయన సమాధానం చెప్పారు
రైతు రుణమాఫీ పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. విపక్షాలు చేసిన విమర్శలకు ఆయన సమాధానం చెప్పారు. రైతు రుణమాఫీ అర్హులైన వారందరికీ రుణమాఫీ జరుగుతుందని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రెండు లక్షల రూపాయల లోపు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ చేసినట్లు ఆయన తెలిపారు. విపక్షాలు సమాచారం తెలియకుండా విమర్శలు చేయడం తగదన్నారు. దేశంలో ఏ ప్రభుత్వమైనా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిందా? అని తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు.
అందని వారికి...
ఇప్పటి వరకూ 22 లక్షల మంది వకూ రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయన్న ఆయన ఇందుకోసం 17,933 కోట్ల నిధులను ప్రభుత్వం విడుల చేసిందని అన్నారు. ఏదైనా సాంకేతిక కారణాలతో రుణమాఫీ జరగకపోతే వారి వివరాలు సేకరించి అందరికీ రుణమాఫీని వర్తింప చేస్తామని తెలిపారు. ఇప్పటికే రైతు రుణమాఫీకి సంబంధించి వివరాలను పోర్టల్ లో అప్‌లోడ్ చేయాలని అధికారులకు చెప్పామని తెలిపారు. తమ ప్రభుత్వం పారదర్శకతతో వ్యవహరిస్తుందని చెప్పుకొచ్చారు.