Telangana : నేటి నుంచి ప్రజాపాలన
తెలంగాణలో ఆరు గ్యారంటీలను పొందడానికి నేటి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు.
తెలంగాణలో ఆరు గ్యారంటీలను పొందడానికి నేటి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. నేటి నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు జరగనున్నాయి. ఈ గ్రామ సభల్లో సంక్షేమ పథకాలను సొంతం చేసుకునేందుకు అవసరమైన దరఖాస్తును నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. గ్రామసభల్లో ఆ దరఖాస్తును అందచేయాల్సి ఉంటుంది.
గ్రామసభల్లో...
గ్రామసభలను నిర్వహించడం కోసం ప్రతి జిల్లాలోనూ ఐఏఎస్‌లను ప్రత్యేక అధికారులుగా నియమించారు. గ్రామ, మండల, వార్డు, పట్టణ, నగర కార్పొరేషన్ పరిధుల్లో ఈ గ్రామ సభల జరగనున్నాయి. ప్రజాపాలన అని దీనికి నామకరణం చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ లో జరగనున్న గ్రామసభలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి ివిక్రమార్క పాల్గొంటారు. అలాగే ప్రజా ప్రతినిధులు, అధికారులందరూ ఈ గ్రామసభల్లో పాల్గొనాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి.