హై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన బండి సంజయ్

కరీంనగర్ లో తనపై నమోదైన కేసును విచారించాలంటూ హై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కరీంనగర్ జుడిషియల్ మెజిస్ట్రేట్ తనపై ఇచ్చిన రిమాండ్

Update: 2022-01-04 11:04 GMT

కరీంనగర్ లో కోవిడ్ రూల్స్ ఉల్లంఘించారంటూ రెండ్రోజుల క్రితం తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిన్న కరీంనగర్ కోర్టులో ఆయనను హాజరు పరచగా.. కోర్టు బెయిల్ రద్దు చేసి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన హై కోర్టును ఆశ్రయించారు. కరీంనగర్ లో తనపై నమోదైన కేసును విచారించాలంటూ హై కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కరీంనగర్ జుడిషియల్ మెజిస్ట్రేట్ తనపై ఇచ్చిన రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయాలని, తనపై నమోదై ఉన్న ఐపీసీ 333సెక్షన్ ను కొట్టివేయాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు.

హైకోర్టును అభ్యర్థిస్తూ.. అత్యవసర విచారణ చేపట్టాలని కోరడంతో న్యాయస్థానం అంగీకరించింది. కానీ.. ఎమ్మెల్యే, ఎంపీలకు సంబంధించిన కేసుల విచారణకు తనకు రోస్టర్ లేదని జస్టిస్ పిటిషన్‌ను తిరస్కరించారు. ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసు కాబట్టి.. ఎమ్మెల్యే, ఎంపీల కేసులు విచారణ జరిపే కోర్టుకు వెళ్ళాలని న్యాయవాదికి సూచించారు. బండి సంజయ్ క్వాష్ పిటిషన్ తమ పరిధిలోకి రాదని జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ తేల్చేయడంతో మరో బెంచ్‌కు బదిలీ చేయాలని రీజిస్ట్రీకి ఆదేశాలు ఇస్తూ.. జస్టిస్ ఉజ్జన్ బాయాల్ బెంచ్‌కు సిఫార్స్ చేశారు.


Tags:    

Similar News