బ్రేకింగ్.. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
బ్రేకింగ్.. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు తీవ్ర అస్వస్థత;
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లో నిలిచింది. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు విద్యార్థులు ఎగ్ కర్రీ రైస్ భోజనం చేయగా కలుషిత ఆహారం తినడంతో అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది. సుమారు 1200 మంది విద్యార్థులు వాంతులు చేసుకోగా ఇందులో 300 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. వాంతులు చేసుకున్నవారికి వారి వారి హాస్టల్ రూముల్లోనే ఉంచి మాత్రలు ఇచ్చారు. అస్వస్థకు గురైన వారికి అంబులెన్స్‌తో పాటు, కాలేజీ సిబ్బంది కార్లలో త్రిబుల్ ఐటీలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.