Telangana : నేడు సద్దుల బతుకమ్మ
నేడు తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈరోజు సద్దుల బతుకమ్మ జరుగుతుంది
నేడు తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈరోజు సద్దుల బతుకమ్మ జరుగుతుంది. ఈరోజుతో బతుకమ్మ వేడుకలు ముగియనున్నాయి. తెలంగాణలో అందరికీ నేడు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆడ బడుచులందరూ ఉదయమే తలంటు స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి..గౌరమ్మకు పూజ చేసి.. అటు పై భోజనం చేస్తారు. సాయంకాలం వేళ ఆడబడుచులు పేర్చి అలంకరించిన బతుకమ్మలతో ఊరేగింపుగా కాలువ వద్దకో, ఒక వాగు లేదా చెరువు గట్టుకో చేరుకుని అక్కడ బతుకమ్మలు ఆడతారు.
ట్యాంక్ బండ్ వద్ద...
ఒకదాని పక్కన ఒకటి పెట్టీ .. వీనుల విందుగా బతుకమ్మ పాటలు పాడతారు. కోలాటం ఆడతారు. అటుపై బతుకమ్మలను నీట నిమజ్జనం చేసి.. పోయి రావమ్మా వచ్చే ఏడాది అని ప్రార్థిస్తారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా ట్యాంక్‌బండ్ పై బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు. సద్దుల బతుకమ్మను అత్యంత వేడుకగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.