వివేకా కేసు : ప్రత్యేక కేటగిరీ ఖైదీగా భాస్కర్ రెడ్డి

ఇదిలా ఉండగా.. భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. బెయిల్ పై విచారణను..

Update: 2023-06-03 05:38 GMT

ys bhaskar reddy bail

వైఎస్ వివేకా హత్యకేసులో అరెస్టైన వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ కోర్టు ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా పరిగణించింది. భాస్కర్ రెడ్డి వయస్సు, ఆరోగ్యం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని తనను ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా చూడాలని భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఆయన విజ్ఞప్తిని పరిశీలించిన కోర్టు.. అందుకు సానుకూలంగా స్పందించింది. భాస్కరరెడ్డిని సీబీఐ కోర్టు ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా ఉంచేందుకు అంగీకరించింది.

ఇదిలా ఉండగా.. భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. బెయిల్ పై విచారణను జూన్ 5కి వాయిదా వేసింది. ప్రస్తుతం భాస్కర్ రెడ్డి చంచల్ గూడ జైలులో ఉన్నారు. కాగా.. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భాస్కర్ రెడ్డి కొడుకు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇటీవలే తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సీబీఐ విచారణకు సహకరించాలని అవినాష్ ను ఆదేశించిన విషయం తెలిసిందే.


Tags:    

Similar News