Telangana : భువనగిరి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పాగా
భువనగిరి మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పరమయింది. భువనగిరి మున్సిపల్ ఛైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది
తెలంగాణలో ప్రభుత్వం మారడంతో వరసగా మున్సిపల్ పాలకవర్గాల్లో కూడా అధికార పార్టీ నెమ్మదిగా సొంతం చేసుకుంటుంది. ఆ యా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, జిల్లాల మంత్రులు మున్సిపల్ కౌన్సిలర్లతో మాట్లాడి తమ పార్టీ అభ్యర్థిని మున్సిపల్ ఛైర్మన్ గా నియమించేందుకు స్వయంగా రంగంలోకి దిగడంతో మున్సిపాలిటీలు కాంగ్రెస్ పరమవుతున్నాయి.
ముందుగానే రాజీనామా చేయడంతో...
తాజాగా భువనగిరి మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పరమయింది. భువనగిరి మున్సిపల్ ఛైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అయితే కాంగ్రెస్ వైపు ఎక్కువ మంది కౌన్సిలర్లు మొగ్గు చూపడంతో బీఆర్ఎస్ కు చెందిన ఛైర్మన్, వైస్ ఛైర్మన్ లు తమ పదవులకు తమంతట తామే రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ కు భువనగిరి మున్సిపాలిటీని సొంతం చేసుకోవడం సులువుగా మారింది.