నా ఓటమికి కారణాలివే : కోమటిరెడ్డి
తన ఓటమిని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంగీకరించారు. అయితే నైతికంగా టీఆర్ఎస్ గెలవలేదన్నారు
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం ఖాయమైంది. విజయం దిశగా టీఆర్ఎస్ పయనిస్తుంది. తెలంగాణ భవన్ లో గెలుపు సంబరాలు జరుపుకుంటున్నారు. 12 రౌండ్లు ముగిసే సరికి 7,836 ఓట్ల ఆధికత్యతో టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు.
నైతికంగా...
దీంతో తన ఓటమిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంగీకరించారు. అయితే నైతికంగా టీఆర్ఎస్ గెలవలేదన్నారు. టీఆర్ఎస్ నేతలు డబ్బులు, మద్యాన్ని పంచి గెలిచారని ఆయన మీడియా ఎదుట వ్యాఖ్యానించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని కోమటిరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ అధర్మంగా గెలిచినట్లేనని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. రిటర్నింగ్ అధకారి కూడా నిబంధనలను పాటించలేదన్నారు.