కవిత ఏమైనా స్వతంత్ర సమరయోధురాలా?

సీబీఐ విచారణలో అన్నీ బయటకు వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు;

Update: 2022-12-11 07:45 GMT

సీబీఐ విచారణలో అన్నీ బయటకు వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆమె ఏమైనా స్వాతంత్ర్య సమరయోధురాలా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ చట్ట ప్రకారం ఏ దర్యాప్తు సంస్థ అయినా విచారణ చేస్తుందని ఆయన అన్నారు.

జైలు కెళ్లడం ఖాయం...
తప్పు చేసిన బీఆర్ఎస్ నేతలు జైలు కెళ్లడ ఖాయమని ఆయన అన్నారు. సీబీఐ వాళ్లు చాయ్ బిస్కట్ ల కోసం రాలేదన్నారు. తప్పు చేసిన వాళ్లే పెద్ద పెద్ద హోర్డింగ్ లు పెట్టుకుంటున్నారని బండి సంజయ్ అన్నారు. తప్పు చేయకుంటే విచారణకు ఎందుకు భయపడుతున్నారని ఆమె అన్నారు.


Tags:    

Similar News