KCR in Assembly: తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టిన కేసీఆర్

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎట్టకేలకు

Update: 2024-07-25 06:54 GMT

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎట్టకేలకు తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. ప్రతిపక్ష హోదాలో తొలిసారి ఆయన అసెంబ్లీకి హాజరయ్యారు. నందిన‌గ‌ర్‌లోని త‌న నివాసం నుంచి కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమ‌న్, జీవ‌న్ రెడ్డి ఉన్నారు. ఎన్నికల్లో పార్టీ ఓడిన తర్వాత అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుకాలేదు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి సైతం రాలేదు. ఆ తర్వాత స్పీకర్ ఛాంబర్ లో ప్రత్యేకంగా ప్రమాణం చేశారు కేసీఆర్.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. దీంతో ఆయన అసెంబ్లీకి హాజరవుతున్నారు. 2024-25 ఆర్థిక బడ్జెట్‌ను అసెంబ్లీలో మల్లు భట్టివిక్రమార్క, శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ తర్వాత జరిగే చర్చలో కేసీఆర్ భాగమవుతారా లేదా అనే సస్పెన్స్ ప్రస్తుతం కొనసాగుతూ ఉంది.


Tags:    

Similar News