Delhi Liqour Scam : కేసీఆర్ తొలి స్పందన
తెలంగాణ సమాజం బీఆర్ఎస్ ను ఎన్నడూ వదులుకోదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి స్పందించారు. తెలంగాణ సమాజం బీఆర్ఎస్ ను ఎన్నడూ వదులుకోదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. చిల్లరమల్లర రాజకీయ శక్తులను ఎవరూ ఆదరించరని అన్నారు. తెలంగాణ పార్టీ క్యాడర్ కు ఆయన బహిరంగ లేఖ రాశారు. లక్షల కుట్రలను ఛేదించి సాధించిన పార్టీ మనది అని పేర్కొన్నారు. నాడు భయపడి ఉంటే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రగతిని అడుగడుగునా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
దుష్ప్రచారాలను....
దుష్ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఏర్పడిందని బీజేపీ బరితెెగించి దాడులు చేస్తుందని పేర్కొన్నారు. పనికి మాలిన పార్టీలు దుష్ప్రచారాలు చేస్తున్నాయని అన్నారు. ఎప్పుడైనా ధర్మమే జయిస్తుందని, ప్రజల కేంద్ర బిందువుగా పార్టీ పనిచేస్తుందని, లక్షల కుట్రలను ఛేదించిన పార్టీ మనదని పేర్కొన్నారు. ఈ మేరకు రెండు పేజీల లేఖను కేసీఆర్ విడుదల చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవితను ఈడీ విచారిస్తున్న సందర్భంలో ఆయన ఈ లేఖను విడుదల చేయడం విశేషం.