Kalvakuntla Kavitha : చంద్రబాబు అరెస్ట్‌పై కవిత ఏమన్నారంటే?
చంద్రబాబు అరెస్ట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందిచారు. ఈ వయసులో ఆయన అరెస్ట్ దురదృష్టకరమని వ్యాఖ్యానించారు;
చంద్రబాబు అరెస్ట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందిచారు. ఈ వయసులో ఆయన అరెస్ట్ దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ట్విట్టర్ లో "ఆస్క్ కవిత" అనే కార్యక్రమంలో ఆమె అనేక అంశాలపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇందులో చంద్రబాబు అరెస్ట్ పై స్పందించమని ఒక నెటిజన్ కోరాగా పై విధంగా స్పందించారు. ఈ వయసులో చంద్రబాబు అరెస్ట్ జరగడం దురదృష్టకరమని, ఆయన కుటుంబం బాధను తాను అర్థం చేసుకున్నానని తెలిపారు. చంద్రబాబు కుటుంబ సభ్యులకు తన సానుభూతి అని ఆమె రిప్లయ్ ఇచ్చారు.
సర్వేల్లోనే గెలుపు....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై కూడా కల్వకుంట్ల కవిత స్పందించారు. తమకు ఏ పార్టీతోనూ పొత్తులేదన్న కవిత, తెలంగాణ ప్రజలే తమ జట్టు అని తేల్చారు. మరోసారి గెలిచి కేసీఆర్ సర్కార్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమన్న ధీమాను కవిత వ్య్తం చేశారు. బీఆర్ఎస్ కు వందకు పైగా స్థానాలు వస్తాయని ఆమె అంచనా వేశారు. బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించడంపై కూడా కవిత స్పందించారు. అది ఎన్నికల జిమ్మిక్కు మాత్రమేనని తెలిపారు. మరి బీజేపీ బీసీ రాష్ట్ర అధ్యక్ష్య పదవి నుంచి తప్పించి అగ్రవర్ణాలకు ఎందుకు ఆ పదవి ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ గెలుపు కేవలం సర్వేల్లోనే కనపిస్తుందని ఆమె ఎద్దేవా చేశారు.