బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ లు
నేడు ఏసీబీ అధికారుల ఎదుట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానుండటంతో బీఆర్ఎన్ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు;
ఫార్ములా ఈ కారు రేసు కేసుకు సంబంధించి నేడు ఏసీబీ అధికారుల ఎదుట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానుండటంతో బీఆర్ఎన్ నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. కాసేపట్లో ఏసీబీ ఆఫీస్‌కు మాజీ మంత్రి కేటీఆర్ రానున్నారు. రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ నుంచి నందినగర్ లోని ఇంటికి వెళ్లి ఏసీబీ ఆఫీస్‌కు కేటీఆర్ బయల్దేరినట్లు తెలిసింది.
పాడి కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్ట్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఆ నేతల ముందస్తు అరెస్ట్ లు జరుగుతున్నాయి. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 100 మంది బీఆర్‌ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ లు చేసినట్లు తెలిసింది. బీఆర్‌ఎస్వీ నేత మేకల విద్యాసాగర్ ను అరెస్ట్ చేశారు. ఏసీబీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now